Devara: దేవర గ్రాఫిక్స్ బడ్జెట్ ఖర్చు అంతా.. ఈ లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకోగా తారక్ అభిమానులలో ఎంతోమందికి ఈ సినిమా ఫేవరెట్ మూవీ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో దేవర మూవీ తెరకెక్కుతుండగా ఈ సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కు కూడా ఎక్కువగానే ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది.

దేవర సినిమా గ్రాఫిక్స్ కోసమే ఏకంగా 140 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది. గ్రాఫిక్స్ కోసమే ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారంటే ఇది రికార్డ్ అనే చెప్పాలి. దేవర గ్రాఫిక్స్ బడ్జెట్ ఖర్చు తెలిసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. దేవర సినిమా కోసం కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ రేయింబవళ్లు ఎంతగానో కష్టపడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

దేవర (Devara) మూవీ యాక్షన్ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. దేవర సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తుండగా దేవర సినిమాతో సొంతింటికి వచ్చినట్టు ఉందని ఆమె నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర కమర్షియల్ లెక్కలు కూడా భారీ రేంజ్ లో ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ఈ సినిమాకు 400 నుంచి 500 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరగనుందని సమాచారం. ఈ సినిమా సక్సెస్ తో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని కొరటాల శివ ఫీలవుతున్నారని తెలుస్తోంది. కొరటాల శివ ఆచార్య సినిమాతో ఫ్లాప్ ను సొంతం చేసుకోగా ఆ సినిమా వల్ల తనపై వచ్చిన విమర్శలకు ఈ సినిమాతో సమాధానం చెప్పడం గ్యారంటీ అని అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. కొరటాల శివను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus