DEVARA 2: ‘దేవర’, ‘వీరమల్లు’ భవిష్యత్తు ఏంటి? సీక్వెల్స్ ఆగిపోయాయా?

ఎన్టీఆర్ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర చేసిన విషయం తెలిసిందే. కొరటాల శివ సృష్టించిన ఆ సముద్రం బ్యాక్ డ్రాప్, ఎన్టీఆర్ విశ్వరూపం ఆడియన్స్‌కి బాగానే కనెక్ట్ అయ్యింది. సహజంగానే హిట్ సినిమా అంటే సీక్వెల్ ఉంటుందని, అసలు కథ పార్ట్ 2లోనే రివీల్ అవుతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని వార్తలు అభిమానుల్లో కొత్త టెన్షన్ పుట్టిస్తున్నాయి.

DEVARA 2

నిజానికి ‘దేవర 2’ ఆగిపోయిందనే ప్రచారం గతంలోనే గట్టిగా జరిగింది. అప్పట్లో చిత్ర యూనిట్ వెంటనే స్పందించి, అవన్నీ గాలి వార్తలే అని కొట్టిపారేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్‌లో ఒక భారీ సీక్వెల్ అటకెక్కిందనే గుసగుసలు మొదలయ్యాయి. ఆ రూమర్ మళ్ళీ దేవర చుట్టూనే తిరుగుతుండటంతో, ప్రాజెక్ట్ ఉందా? లేక పక్కన పెట్టేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ కన్ఫ్యూజన్ లిస్టులోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ కూడా చేరిపోయింది. పార్ట్ డిజాస్టర్ కాగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. అసలు పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది? రిలీజ్ ఆలోచన ఉందా లేదా? అనే క్లారిటీ ఎవరికీ లేదు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న చర్చ ఏంటంటే.. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉందట. ‘దేవర 2’ స్క్రిప్ట్ విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ రాలేదని, కొరటాల వేరే ప్రాజెక్ట్ వైపు చూస్తున్నారని ఒక టాక్. ఇక ‘వీరమల్లు’ పరిస్థితి పూర్తిగా పవన్ చేతిలో ఉంది. ఆయన డేట్స్ అడ్జస్ట్ చేస్తే తప్ప సినిమా ముందుకు కదిలే పరిస్థితి లేదు.

మొత్తానికి ఈ రెండు భారీ చిత్రాల సీక్వెల్స్ విషయంలో ఇండస్ట్రీలో ఏదో తెలియని సందిగ్ధత నెలకొంది. ఏ సినిమా ఆగిపోయింది? ఏది ముందుకు వెళ్తుంది? అనేది మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తే గానీ తెలియదు. అప్పటివరకు అభిమానులకు ఈ సస్పెన్స్ తప్పదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus