కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలవుతుందని నందమూరి అభిమానులు భావించగా ఫ్యాన్స్ అంచనాలకు భిన్నంగా ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ నెల 29వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. త్వరలో డెవిల్ మూవీ ప్రమోషన్స్ మొదలుకానున్నాయి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో డెవిల్ ఒకటి కాగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయని భోగట్టా.
ఇదే సమయంలో కళ్యాణ్ రామ్ దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి సైతం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం దేవర సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తే ఆ అప్ డేట్స్ వల్ల డెవిల్ ప్రమోషన్స్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ రీజన్ వల్లే దేవర మేకర్స్ నిర్ణయం మారిందని తెలుస్తోంది. దేవర సినిమా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోంది.
సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. దేవర టీజర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని ప్రేక్షకులను ఈ టీజర్ కచ్చితంగా మెప్పించడం ఖాయమని తెలుస్తోంది. దేవర సినిమాకు మేకర్స్ ఊహించని స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. తారక్ ఈ సినిమాకు లాభాల్లో వాటా తీసుకుంటున్నారని తెలుస్తోంది. క్రేజ్ ఉన్న టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.
ఈ సినిమాకు పని చేస్తున్న అందరి రెమ్యునరేషన్ 150 కోట్ల రూపాయల వరకు ఉంటుందని భోగట్టా. దేవర సినిమా రికార్డులు తిరగరాసే మూవీ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2024 బిగ్గెస్ట్ హిట్ గా దేవర నిలుస్తుందేమో చూడాల్సి ఉంది. దేవర1 ప్రమోషన్స్ లో దేవర2 గురించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తారక్ తన కెరీర్ లో (Devara) ఈ మూవీ మెమరబుల్ సినిమాగా నిలుస్తుందని ఫీలవుతున్నారు.