అందాల ప్రదర్శనతోనే కాదు.. అభినయంతో కూడా చాలా ఏళ్ల పాటు అభిమానులను అలరించొచ్చు అంటే నమ్ముతారా? ఇప్పుడు సినిమాలు చేయకపోతుతన్నా కేవలం పాత్ర పవర్‌తో గత కొన్ని దశాబ్దాలుగా ఓ హీరోయిన్‌ని గుర్తు పెట్టుకోవచ్చు అంటే నమ్ముతారా? మామూలుగా అయితే నమ్మకపోవచ్చు కానీ.. ఆ హీరోయిన్ పేరు చెబితే కచ్చితంగా నమ్ముతారు. ఆమెనే దేవయాని. అవునండీ ‘సుస్వాగతం’ దేవయాని గురించే చెప్పేది. అయితే ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఆమె కుమార్తె గురించి.
గత కొన్ని నెలలుగా దేవయాని కుమార్తె తెరంగేట్రం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమె కొన్ని సినిమా ఫంక్షన్లలో కనిపించినప్పుడు కూడా ఇదే విషయంలో చర్చలు జరిగాయి. ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. అది కూడా తెలుగులో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న సినిమా రీమేక్‌తో. పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించేలా తెలుగులో రూపొందిన ‘కోర్ట్’ సినిమానే ఆ సినిమా. ఈ రీమేక్ ప్రారంభోత్సవం ఇటీవల చెన్నైలో జరిగింది. ‘రంజన్: ది అడ్వకేట్’ అనే టైటిల్‌తో సీనియర్ దర్శకుడు త్యాగరాజన్ ఈ సినిమాను రూపొందించనున్నారు.
జీన్స్ ప్రశాంత్ టైటిల్ (న్యాయవాది) పాత్రను పోషిస్తున్నారు. నటి దేవయాని కుమార్తె ప్రియాంక రాజకుమారన్ ఓ ముఖ్య పాత్రధారి. నిర్మాత ఎస్.కథిరేశన్ తనయుడు హరి ఈ సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. మరో కీలక పాత్ర మంగపతిగా ఎవరు నటిస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సినిమాలో ఆ పాత్రతో నటుడు శివాజీ తెలుగులో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చారు. మరి ఆ స్థాయిలో తమిళంలో ఎవరు నటిస్తారు అనేది చూడాలి.
తెలుగు ‘కోర్ట్’ సినిమా కథేంటంటే.. చంద్రశేఖర్ అలియాస్ చందు (రోషన్) ఇంటర్ ఫెయిల్ అయిన ఓ కుర్రాడు. ఓ ఇంటి దగ్గర వాచ్‌మెన్‌గా పని చేసే చందుకి.. పెద్దింటి అమ్మాయి, ఇంటర్‌మీడియట్ చదువుతున్న జాబిలి (శ్రీదేవి)కీ మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ విషయం ఆమె ఇంట్లో తెలిసిపోతుంది. దీంతో కుటుంబం పరువు, స్థాయి అని మాట్లాడే జాబిలి బంధువు మంగపతి (శివాజీ) కోపంతో రగిలిపోతాడు. ఈ క్రమంలో పోక్సో చట్టంతోపాటు, ఇతర కఠినమైన సెక్షన్ల కింద చందుపై కేసు పెడతాడు. ఈ పరిణామాలు చందు జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? పెద్ద న్యాయవాది మోహన్‌రావు (సాయికుమార్) దగ్గర పనిచేసే జూనియర్ లాయర్ సూర్యతేజ (ప్రియదర్శి) ఈ కేసు భుజాన వేసుకొని గెలిచాడా? చందుని గెలిపించాడా అనేదే సినిమా.