బాలయ్యను దేవి…లైట్ తీసుకున్నాడా?

టాలీవుడ్ సింహం నందమూరి బాలకృష్ణ అంటే ఇండస్ట్రీలో ఎంత గౌరవమొ అంటే భయం కూడా. అయితే ఆయన్ని చూస్తేనే భయపడిపోయే పరిస్థితులు ఉన్న మన టాలీవుడ్ లో టాప్ యంగ్ మ్యూజిక్ దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ బాలయ్యను లైట్ తీసుకున్నాడు అని తెలుస్తుంది..ఇంతకీ విషయం ఏమిటంటే…తాజాగా బాలయ్య నటిస్తున్న ‘గౌతామీపుత్రశాతకర్ణి’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

అయితే లెజెండ్ సినిమాకు సూపర్ డూపర్ హిట్ కు ఒకానొక కారణం అయిన దేవిను ఏరీ కోరి మరీ ఈ సినిమాకు తెచ్చిపెట్టుకున్నాడు బాలయ్య…అయితే శాతకర్ణి సినిమాకు సంభందించిన షూటింగ్  జూన్ లో మొదలై మొరాకోలో ఒక భారీ షెడ్యూల్ ఆ తరువాత జార్జియాలో మరో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఈ సినిమాకు సంబంధించిన యుద్ద సన్నివేశాలు అన్నింటిని ఇప్పటికే చిత్రీకరించారు. ఒకవైపు ఈ సినిమా గ్రాఫిక్ వర్క్స్ కూడ చాల వేగంగా జరిగి పోతోంది. ఇక త్వరలోనే పాటలో చిత్రీకరణ సైతం జరగనుంది..కానీ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ఒక్క పాటకు కూడ తన స్వరాలను కంపోజ్ చేయలేదని టాక్.

ప్రస్తుతం దేవిశ్రీ అనేక తెలుగు తమిళ సినిమాలలో బిజీగా ఉండటంతో గోతమీ పుత్ర శాతకర్ణి’ పై మనసు పెట్టలేక పోవడంతో ఒక్క మ్యూజిక్ సిటింగ్ అవ్వలేదని టాక్. ఇక అదే క్రమంలో దేవిని తప్పించి వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను లైన్ లో పెడదాం అని క్రిష్ అనుకుంటున్నాడు. కానీ దేవి మాత్రం ప్రతిష్టాత్మకమైన ఈ మూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోనని చెబుతున్నాడు. మరి బాలయ్య అడిగాడు కదా అని హడావిడిగా దేవి ట్యూన్స్ ఇస్తే అసలుకే మోసం వస్తుంది. మరి దీన్ని బాలయ్య ఎలా పరిష్కరిస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus