Devil Collections: ‘డెవిల్’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • January 6, 2024 / 11:34 AM IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని ‘అభిషేక్ పిక్చ‌ర్స్’ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మించడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశారు. డిసెంబ‌ర్ 29న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కళ్యాణ్ రామ్ నటన, ట్విస్ట్ లు.. ఈ సినిమాకు హైలెట్ అని అంతా అన్నారు.

కానీ మొదటి రోజు ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. అయినప్పటికీ వీకెండ్ వరకు ఓకే అనిపించిన ఈ సినిమా ఆ తర్వాత జోరు చూపించలేకపోయింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 3 cr
సీడెడ్ 1.38 cr
ఉత్తరాంధ్ర 0.83 cr
ఈస్ట్ 0.63 cr
వెస్ట్ 0.40 cr
గుంటూరు 0.58 cr
కృష్ణా 0.47 cr
నెల్లూరు 0.28 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.57 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.59 cr
 ఓవర్సీస్ 0.93 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 9.09 cr (షేర్)

‘డెవిల్’ (Devil) చిత్రానికి రూ.20.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కి రూ.20.7 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయాలి. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.9.09 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఈ మూవీ రూ.11.61 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus