Devil Trailer Review: ‘డెవిల్’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • December 12, 2023 / 07:56 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా అభిషేక్ నామా డైరెక్ట్ చేసి నిర్మించిన చిత్రం ‘డెవిల్’. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. డిసెంబర్ 29 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ట్రైలర్ ని వదిలారు. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 20 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఇందులో బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ డెవిల్ గా హీరో కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఇచ్చారు.

ఈ ట్రైలర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండి ఉంది.ఇది కూడా పీరియాడికల్‌ డ్రామా కాబట్టి విజువల్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి అని ట్రైలర్ తో చెప్పకనే చెప్పారు. ఇది అప్పటి కాలానికి సంబంధించిన స్పై థ్రిల్లర్ కాబట్టి రెగ్యులర్ స్పై థ్రిల్లర్స్ కి భిన్నంగా ఉండబోతుంది అని ప్రతి ఫ్రేమ్ తో చెప్పకనే చెప్పారు. అలాగే ఒక మర్డర్ కేసును దర్యాప్తు చేస్తున్న ఏజెంట్ గా కూడా కళ్యాణ్ రామ్ కనిపించి ఆకట్టుకున్నారు.

సంయుక్త మీనన్ గ్లామర్ యాంగిల్ ను కూడా చూపించారు. తర్వాత ఆమె పాత్రలో చాలా ఎమోషన్ దాగి ఉన్నట్టు హింట్ ఇచ్చారు. ‘విశ్వాసంగా ఉండటానికి, విధేయతతో బతికేయడానికి కుక్కని అనుకున్నావా.. లయన్’, ‘శవాలు సాక్ష్యం చెప్పడం ఎప్పుడైనా చూశావా” అంటూ కళ్యాణ్ రామ్ పలికిన డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ట్రైలర్ (Devil) అయితే బాగానే ఉంది మీరు కూడా ఓ లుక్కేయండి

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus