Dhamaka Teaser: ఆకట్టుకుంటున్న రవితేజ ‘ధమాకా’ మాస్ క్రాకర్

రవితేజ నుండి ఈ ఏడాది వచ్చిన రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని అతను ‘ధమాకా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ కామెడీ అండ్ యాక్షన్ పుష్కలంగా ఉంటుందని చిత్ర బృందం ముందు నుండి చెబుతూ వస్తోంది.రవితేజకి జోడీగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది.ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన పాటలు బాగానే ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. ఈరోజు మాస్ క్రాకర్ పేరుతో ‘ధమాకా’ నుండి దీపావళి కానుకగా ఓ టీజర్ ను విడుదల చేశారు. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. ‘ఇఫ్ ఐ సి విలన్ ఇన్ యు… యు విల్ సి ఎ హీరో ఇన్ మీ’ ‘బట్ ఐ యామ్ ఎ శాడిస్ట్ వెన్ ఐ యామ్ ఇన్ యాక్షన్’ అనే పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ మొదలైంది.

ఆ వెంటనే ‘ఆడు మనిషా? వాషింగ్ మిషనా? ఇలా ఉతుకుతున్నాడేంటి సార్’ అంటూ విలన్ గ్యాంగ్ లో ఒకరు హీరో గురించి చెప్పిన డైలాగ్ మంచి హై ఇచ్చింది. ఈ టీజర్… ‘యాక్షన్ అండ్ కామెడీ టచ్ తో ఉంది’. ‘నన్ను కొడితే ఎవడొస్తాడో తెలుసా’ అంటూ కమెడియన్ సత్యం రాజేష్ అంటుంటే ‘యాంబులెన్స్ ఏసుకుని డ్రైవర్ వస్తాడు’ అంటూ రవితేజ చెప్పే పంచ్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. టీజర్ లో హీరోయిన్ శ్రీలీలతో పాటు విలన్ గా చేస్తున్న జయరాం కూడా కనిపించాడు.

టీజర్ చివర్లో విలన్ మనిషి రవితేజ తల పై గన్ పెడితే ‘అటు నుంచి ఒక్క బుల్లెట్ వస్తే.. ఇటు నుంచి దీపావళే’ అంటూ రవితేజ చెప్పిన మాస్ డైలాగ్ కూడా అదిరింది. సంగీత దర్శకుడు భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ టీజర్ కు హైలెట్ గా నిలిచింది అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ‘ధమాకా’ మాస్ క్రాకర్ బాగానే పేలింది .. టీం చెప్పినట్టు అయితే డబుల్ ఇంపాక్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. మీరు కూడా ఓ లుక్కేయండి :

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!


ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus