Dhanush, Sivasankar: పది లక్షలు సాయం చేసిన ధనుష్.. కానీ?

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన శివ శంకర్ మాస్టర్ ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో కరోనాకు వైద్యం చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన ఫ్యామిలీ ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రముఖ నటుడు సోనూసూద్ ఇప్పటికే శివ శంకర్ మాస్టర్ కు తన వంతు సహాయం చేస్తానని ప్రకటించారు. మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ శివ శంకర్ మాస్టర్ చికిత్స కోసం పది లక్షల రూపాయలు ఇచ్చారని సమాచారం.

ప్రచారం చేసుకోకుండా సైలెంట్ గా ధనుష్ ఈ మొత్తాన్ని ఇచ్చారని తెలుస్తోంది. శివ శంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులకు సైతం తాను డబ్బులు ఇచ్చిన విషయం గురించి పబ్లిసిటీ చేయవద్దని ధనుష్ కోరినట్టు బోగట్టా. ధనుష్ గొప్ప మనస్సును నెటిజన్లు సోషల్ మీడియాలో మెచ్చుకుంటున్నారు. మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా స్పందించి శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి తమ వంతు సహాయం చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి శివ శంకర్ మాస్టర్ విషయంలో పెద్దగా స్పందన లేదు. శివ శంకర్ మాస్టర్ తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో వందల సంఖ్యలో పాటలకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు. నటుడిగా కూడా శివ శంకర్ మాస్టర్ మంచి పేరు తెచ్చుకున్నారు. శివ శంకర్ మాస్టర్ పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించగా ఆ షోలు ఊహించని స్థాయిలో హిట్ అయ్యాయి.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus