సినిమాలు ఓకే చేయడంలో, షూటింగ్ చేయడంలో, రిలీజ్ చేయడంలో ధనుష్ స్పెషాలిటీనే వేరు. సినిమా షూటింగ్ పూర్తవుతోంది అనగానే.. కొత్త సినిమాను పట్టాలెక్కించేస్తాడు. ఈ క్రమంలో మరో సినిమాకు ఓకే చెప్పేస్తాడు. ఆ వెంటనే మరో దర్శకుడి కథను ఓకే చేసేస్తుంటాడు. ఆ లెక్కన ఇప్పుడు ధనుష్ చేతిలో మొత్తంగా పది సినిమాలు ఉన్నాయి తెలుసా? అవును మీరు చదివింది కరెక్టే.. చేతి నిండా సినిమాలు ఉన్నాయి మరి.
ధనుష్ ఇప్పుడు తన 55వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అదే రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓం’ సినిమా. ఈ సినిమాను అక్టోబరు 16న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ రోజు వస్తుందో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఆ విషయం పక్కన పెడితే.. ఆ తర్వాత మారి సెల్వరాజ్ డైరక్షన్‌లో ఓ సినిమా.. తమిళరసన్ దర్శకుడిగా ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. వెట్రిమారన్‌తో ఓ సినిమా ఉంటుందని ఇప్పటికే సమాచారం వచ్చింది.
వెంకట్ ప్రభుత్వం దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని ఇటీవల తెలియజేశారు. ఇది కాకుండా మరో సినిమా కూడా ఉంది. ఆ సినిమాను కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తారని సమాచారం. ఇక అవకాశం ఉన్న సినిమాల దర్శకుల సంగతి చూస్తే.. సీనియర్ దర్శకుడు శివతో ఓ సినిమా చేస్తారని టాక్. ఈ సినిమా జనవరిలో ఉండొచ్చని టాక్. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశం ఉంది. త్వరలో విడుదల కానున్న ‘ఓం’ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని కోడంబాక్కం వర్గాల సమాచారం. ఈ సిరీస్‌లో ఆఖరున వెట్రిమారన్‌తో మరో సినిమా ఉంటుందని టాక్.
హెచ్.వినోద్ కూడా ధనుష్‌కి ఓ సినిమా కథ చెప్పారట. దీని విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. ఇవిలా ఉండగా బాలీవుడ్‌లో మరో సినిమాను చేసే ఆలోచనలో ఉన్నాడట ధనుష్. ఆర్.బాల్కి డైరక్షన్‌లో ఆ సినిమా ఉండొచ్చంటున్నారు.