హాలీవుడ్ సినిమాలో నటిస్తోన్న ధనుష్..!

తమిళం, తెలుగు భాషల్లో హీరో ధనుష్‌కు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో స్టార్ హీరోల్లో ఒకరుగా చలామణీ అవుతూ వస్తోన్న ధనుష్, తెలుగులోనూ డబ్బింగ్ సినిమాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. ఇక షమితాబ్ అనే సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకూ పరిచయమైన ఈ స్టార్, తాజాగా ఏకంగా హాలీవుడ్ సినిమాలో నటించేందుకు సిద్ధమై టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్’ అన్న పేరుతో తెరకెక్కనున్న ఓ హాలీవుడ్ సినిమాలో ధనుష్ ఓ ప్రధాన పాత్ర పోషించనున్నారు.

మర్జానే సర్తపి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ వూ ట్రాప్‌డ్ ఇన్ ఇకియా వార్డ్‌రోబ్’ అన్న ప్రముఖ నవల ఆధారం. ఇక హాలీవుడ్‌లో సినిమాకు ఎంపికైన విషయాన్ని స్వయంగా ప్రకటిస్తూ.. “దర్శకురాలు మర్జానే తన సినిమాలో ఓ ప్రధాన పాత్రకు నేను సరిపోతానని భావించి నన్ను ఎంపిక చేశారు. మొదటి సారి ఒక హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీడియా వారికి, అభిమానులకు, ప్రేక్షకులకు, నాకు అండగా నిలబడ్డవారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా” అని తెలిపారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus