ధన్య బాలకృష్ణ అందరికీ తెలుసు కదా. ‘సెవెంత్ సెన్స్’ ‘లవ్ ఫెయిల్యూర్’ వంటి(తమిళ) డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘రాజు గారి గది’ ‘భలే మంచి రోజు’ ‘సెకండ్ హ్యాండ్’ ‘నేను శైలజ’ ‘సావిత్రి’ ‘వీడెవడు’ ‘జయ జానకి నాయక’ ‘లవ్ యాక్షన్ డ్రామా’ వంటి సినిమాలతో బిజీ అయ్యింది.2020 లో వచ్చిన ‘సాఫ్ట్ వేర్ సుధీర్’, ‘అనుకున్నది ఒకటి అయినది ఒకటి’, 2022 లో వచ్చిన ‘జగమే మాయ’ వంటి వాటిలో తప్ప..
ఈమె ఎక్కువ తెలుగు సినిమాల్లో నటించింది లేదు. అయితే రజినీకాంత్ గెస్ట్ రోల్ చేసిన ‘లాల్ సలాం’ లో ఈమె ముఖ్య పాత్ర పోషించింది. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ధన్య పుట్టి పెరిగింది బెంగళూరులో అనే సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. అయితే 12 ఏళ్ళ క్రితం ఈమె తమిళ జనల గురించి ఓ పోస్ట్ పెట్టింది. అందులో ‘డియర్ చెన్నై, మీరు అడుక్కుంటే మేం నీళ్లిచ్చాం. మీరు అడుక్కుంటే మేం కరెంట్ ఇచ్చాం.
మీరు వచ్చి మా అందమైన నగరాన్ని ఆక్రమించారు.మీరు క్షమాపణలు చెబితే మేం దయతలచి ప్లే ఆఫ్స్ కి వెళ్లేలా చేస్తాం. మీరు అడుక్కుంటే మేం ఇస్తాం.. అడుక్కుంటూనే ఇచ్చాం’ అంటూ అప్పట్లో ధన్య ఫేస్ బుక్ పోస్ట్ పెట్టినట్టు ఓ స్క్రీన్ షాట్ ను కొంతమంది నెటిజన్లు వైరల్ చేయడమే కాకుండా ధన్యని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు.
దీంతో ఆమె వెంటనే స్పందించి క్షమాపణలు చెప్పింది. ఆమె మాట్లాడుతూ.. ” ఈ స్టేట్మెంట్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు.తమిళ సినిమాలతోనే నా యొక్క సినీ కెరీర్ ను ప్రారంభించాను. నన్ను టార్గెట్ చేయడానికే ఇలాంటి స్క్రీన్ షాట్ వైరల్ చేస్తున్నారు. అయినప్పటికీ తమిళ ప్రేక్షకులకు నేను (Dhanya Balakrishna) మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలుపుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది ధన్య బాలకృష్ణ.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!