ఇండియన్ క్రికెట్ కెప్టెన్ ని ఆకట్టుకున్న బాహుబలి

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సృష్టించిన వెండి తెర కళాఖండం బాహుబలి సినిమా అభిమానుల జాబితాలో ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్నీ స్వయంగా మహేంద్రసింగ్‌ ధోనీ వెల్లడించారు. తన జీవిత కథ ఆధారంగా వస్తున్న ‘ఎంఎస్‌ ధోనీ: ద అన్‌టోల్డ్‌ స్టోరీ’ సినిమా తెలుగు వెర్షన్‌ ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ధోనీ మాట్లాడుతూ “నేను గత ఏడాది బాహుబలి చూసాను. భలే నచ్చింది. బాహుబలి 2 కోసం ఎదురుచూస్తున్నాను” అని చెప్పారు.

అంతే కాకుండా హైదరాబాద్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ బిర్యానీ అంటే తనకి ఎంతో ఇష్టమని.. ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ టేస్ట్ చేస్తానని వివరించారు. ఉస్మానియా బిస్కెట్స్, లాడ్ బజార్ లో గాజులు బాగుంటాయని స్టార్ క్రికెటర్ చెప్పారు. సుషాంత్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నీరజ్‌ పాండే తెరకెక్కించిన ‘ఎంఎస్‌ ధోనీ : ద అన్‌టోల్డ్‌ స్టోరీ’  సినిమా ఈ నెల 30 వ తేదీన రిలీజ్ కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus