అల్లు అరవింద్ రాంగ్ ప్లాన్ వల్ల చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది

‘మగధీర’ వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టాక.. చరణ్ కి వెంటనే ఆ స్థాయి సక్సెస్ దొరకలేదు. ‘ఆరెంజ్’ సినిమా గురించి ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ.. ఆ టైంలో అది బయ్యర్స్ కి భారీ నష్టాలు మిగిల్చిన సినిమా. నిర్మాత నాగబాబు కూడా నష్టాల్లో కూరుకుపోయారు. తర్వాత వచ్చిన ‘రచ్చ’ ‘నాయక్’ ‘ఎవడు’ వంటి సినిమాలు బాగానే ఆడినా.. అవి చరణ్ కెరీర్ కి హెల్ప్ అవ్వలేదు.

9 Years For Dhruva 

పైగా రెగ్యులర్ మాస్ సినిమాలే చేస్తున్నాడు, ఒక్కటే ఎక్స్ప్రెషన్ తో లాగించేస్తున్నాడు వంటి విమర్శలు చరణ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇక ‘తుఫాన్’ పెద్ద డిజాస్టర్ కాగా ‘గోవిందుడు అందరివాడేలే’ ‘బ్రూస్ లీ’ వంటి సినిమాలు కూడా నిరాశపరిచాయి. అలా చరణ్ కెరీర్ అటూ ఇటుగా ఉన్న టైంలో.. హిట్టు అత్యవసరం అయ్యింది. ఆ టైంలో సురేందర్ రెడ్డి.. చరణ్ తో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు.

స్టార్ రైటర్ వక్కంతం వంశీతో ఓ కథ కూడా రెడీ చేశారు. కానీ దాన్ని పక్కన పెట్టి.. తమిళంలో హిట్ అయిన ‘తనీ ఒరువన్’ రీమేక్ పై వర్క్ చేయమని చిరు- అల్లు అరవింద్ సూచించారు. అలా ‘ధృవ’ స్క్రిప్ట్ రెడీ అయ్యింది.సురేందర్ రెడ్డి తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చాలా మార్పులు చేశారు. చరణ్ తన ఇమేజ్ ను పక్కన పెట్టి చేసిన సినిమా ఇది. 2016 డిసెంబర్ 9న విడుదలైంది.

అయితే ఈ సినిమాని ఆ ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేస్తే బాగుంటుందని చిరు సూచించారు. కానీ అల్లు అరవింద్.. సోలో రిలీజ్ బాగుంటుందని డిసెంబర్ 9కి తెచ్చారు. అది డీమోనిటైజేషన్(నోట్ల రద్దు జరిగిన రోజులు). లిక్విడ్ క్యాష్ కోసం జనాలు ఇబ్బంది పడుతున్న రోజులు. అలాంటి టైంలో ‘ధృవ’ రిలీజ్ అయితే వసూళ్లు రావడం కష్టమే కదా. ఏ క్లాస్ ఆడియన్స్ అంతా బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకుని వెళ్లారు.

కానీ కింద సెంటర్లలో అంటే బి,సి సెంటర్లలోని ప్రేక్షకులు ‘ధృవ’ని చూసేందుకు వెళ్ళలేదు. చరణ్ కి భీభత్సమైన క్రేజ్ ఉన్నదే మాస్ సెంటర్స్ లో..! ఒకవేళ వేరే టైంలో కనుక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే.. కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన సినిమా ఇది.అయితే ఇందులో రాంచరణ్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంటుంది. ఒరిజినల్ కంటే బాగా తీశాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.

కానీ నిర్మాత అల్లు అరవింద్ రాంగ్ రిలీజ్ ప్లాన్ వల్ల దీని రిజల్ట్ మారిపోయింది.నేటితో ‘ధృవ’ సినిమా రిలీజ్ అయ్యి 9 ఏళ్ళు పూర్తికావస్తోంది.

12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags