ధ్రువ

కథ : సంఘ విద్రోహులను కాదు ఆ విద్రోహులను తయారు చేసే వ్యవస్థను నాశనం చేయాలనే ధృడ నిశ్చయంతో పోలీస్ ఆఫీసర్ గా మారిన వ్యక్తి ధృవ (రామ్ చరణ్). వంద మంది దొంగల్ని పట్టుకోవడం కంటే.. ఆ దొంగలకి సహాయం చేసే మెయిన్ పిల్లర్ ను దెబ్బ కొట్టాలనుకొంటాడు. ఆ మెయిన్ పిల్లరే సిద్దార్ధ్ అభిమన్యు (అరవిందస్వామి). మెడికల్ సైంటిస్ట్ గా, ప్రొఫెషనల్ బిజినెస్ గా పైకి కనిపిస్తూ.. ఎవరికీ తెలియకుండా ప్రభుత్వాన్ని సైతం శాసిస్తూతుంటాడు.అటువంటి అత్యంత శక్తిమంతుడితో కండ బలంతో కాకుండా బుద్ధి బలంతో హీరో సాగించిన పోరాటమే “ధృవ” కథాంశం.

నటీనటుల పనితీరు : సిక్స్ ప్యాక్ ఫిజిక్ తో అబ్బురపరిచిన రామ్ చరణ్ పరిణితి చెందిన నటనతో ఆశ్చర్యపరిచాడు. ఎమోషనల్ సీన్స్ లో అక్కడక్కడా తేలిపోయినప్పటికీ.. యాక్షన్ సీన్స్ లో దుమ్ము లేపాడు. ముఖ్యంగా విలన్ పాత్రధారి అయిన అరవిందస్వామితో మైండ్ గేమ్ ఎపిసోడ్స్ లో అరవింద స్వామితో పోటీపడి నటించిన తీరు బాగుంది. సినిమాకి హీరో రామ్ చరణ్ అయినప్పటికీ.. కథకి హీరో మాత్రం అరవిందస్వామి. సూపర్ స్టైలిష్ గా అరవిందస్వామి సరికొత్తగా విలనిజాన్ని చాలా పద్ధతిగా పండించిన విధానం సినిమాకి మెయిన్ హైలైట్. డైలాగ్ డెలివరీ మొదలుకొని, బాడీ లాంగ్వేజ్ వరకూ అన్నీ విషయాల్లోనూ హీరోను డామినేట్ చేసేస్తుంటాడు అరవిందస్వామి.

రకుల్ ప్రీత్ ఈ సినిమాలో గ్లామర్ డోస్ మరింతగా పెంచింది. “పరేషానురా” పాటలో సముద్రతీరంలో ఆరేసిన అందాలు మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించడం ఖాయం. అలాగే పెర్ఫార్మెన్స్ పరంగానూ అలరించింది. నవదీప్ కనపడేది కొద్దిసేపే అయినా.. “జనా” పాత్రలో కావాల్సినంత ఎమోషన్ ను పండించాడు. విలన్ తండ్రిగా పోసాని కామెడీ ఆడియన్స్ ను ఆకట్టుకొంటుంది.మిగతా నటీనటులందరూ పాత్రకి అవసరమైనంతమేరకు చక్కని నటన కనబరిచారు.

సాంకేతికవర్గం పనితీరు : హిప్ హాప్ తమిళ (ఆది) పాటలు ట్రెండీగా ఉండగా.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ప్రతి సీన్ ను తారా స్థాయిలో ఎలివేట్ చేసింది. నేపధ్య సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పుకోవచ్చు. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. కోజప్ షాట్స్, స్లోమోషన్ షాట్స్ బాగున్నాయి. లాంగ్ షాట్ ఫ్రేమ్స్ కనులపండుగగా ఉండగా.. సాంగ్స్ పిక్చరైజేషన్ యమ స్టైలిష్ గా ఉంది. ఫైట్ సీక్వెన్స్ లను డిజైన్ చేసిన విధానం బాగుంది. లైటింగ్, టింట్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి.ఎడిటింగ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి కానీ.. ల్యాగ్ ఎక్కువయ్యింది. వేమారెడ్డి సంభాషణలు మాస్ ఆడియన్స్ ను మాత్రమే టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయి. అల్లు అరవింద్ నిర్మాణ విలువలు సినిమాకి రిచ్ నెస్ ను యాడ్ చేసింది. తమిళ వెర్షన్ తో కంపేర్ చేసుకొంటే, తెలుగు వెర్షన్ చూడ్డానికి బాగుండడానికి అల్లు అరవింద్ నిర్మాణ విలువలు ముఖ్య కారణం.

“కిక్ 2” తర్వాత సురేందర్ రెడ్డి “ధృవ”తో తన స్టైలిష్ మేకింగ్ తో మరోమారు తాను మంచి టెక్నీషియన్ అని ప్రూవ్ చేసుకొన్నాడు. ఒరిజినల్ వెర్షన్ కంటే నిడివి కాస్త పెంచడంతోపాటు, స్క్రీన్ ప్లే పరంగానూ కొద్ది మార్పులు చేసి దర్శకుడిగా తన మార్క్ వేసుకొన్నాడు. హీరో-విలన్ మధ్య మైండ్ గేమ్ సీన్స్ డీల్ చేసిన విధానం ఆడియన్స్ ను విశేషంగా అలరిస్తుంది. అయితే.. ఒరిజినల్ వెర్షన్ కంటే విలన్ పాత్రకున్న ప్రాధాన్యతను కాస్త తగ్గించడం వల్ల సినిమాలోని సోల్ మిస్సయ్యిందనిపిస్తుంది. అయితే.. అది ఒరిజినల్ వెర్షన్ సినిమా చూసినవారికి మాత్రమే. స్ట్రయిట్ గా “ధృవ” సినిమా చూసేవారికి మాత్రం మంచి సస్పెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ చూశామన్న సంతృప్తి కలుగుతుంది.

విశ్లేషణ : రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్స్, మూస యాక్షన్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టేసిన ఆడియన్స్ కు విపరీతంగా నచ్చే చిత్రం “ధృవ”. ముఖ్యంగా మెగాభిమానులకు ఈ సినిమా ఓ విందు భోజనం లాంటిది, ఇంటర్వెల్ లో వచ్చే “ఖైదీ నెం 150” టీజర్ మరో ప్రత్యేక ఆకర్షణ!

రేటింగ్ : 3/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus