బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన నటి దియామీర్జా ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో ఈ నెల 15న దియామీర్జా పెళ్లి కాబోతుంది. అతి తక్కువ మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. ఇదిలా ఉండగా.. 2014లో దియామీర్జా సాహిల్ సంఘ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి చేసుకున్న ఐదేళ్లకు ఈ జంట విడాకులు తీసుకుంది.
ఈ విషయాన్ని దియామీర్జా సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. ఐదేళ్లపాటు కలిసి జీవించిన తరువాత.. పరస్పర అంగీకారంతో విడిపోవడానికి నిర్ణయించుకున్నట్లు.. కానీ తమ స్నేహం మాత్రం కంటిన్యూ అవుతుందని.. ఒకరిపట్ల మరొకరికి ప్రేమ, గౌరవం ఎప్పటికీ ఉంటాయని చెప్పింది. అలా విడిపోయిన తర్వాత దియా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో వైభవ్ రేఖీ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. ముంబైకి చెందిన వైభవ్ వ్యాపారవేత్తగా బాగానే సెటిల్ అయ్యారు.
బాంద్రాలో పాలి హిల్ ఏరియాలో ఆయన నివసిస్తున్నారు. ఇక దియా విషయానికొస్తే.. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అక్కడే పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం తెలుగులో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాలో నటిస్తోంది.