భార్యనే ఛంపాలనే ఆలోచనలో స్టార్ హీరో…

సహజంగా మన హీరోలనే ఫాలో అవుతూ ఉంటారు అభిమానాలు..మరి అలాంటి ఒక స్టార్ హీరో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటే ఆది కూడా మన అభిమానులు ఫాలో అవుతారేమో చూడాలి….ఇంతకీ విషయం ఏమిటంటే…హాలీవుడ్ హీరో జానీ డెప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా.

హాలీవుడ్లో ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’ సిరీస్ చిత్రాలతో పాటు ‘ఏలిస్ ఇన్ వండర్ ల్యాండ్’ సహా చాలా చిత్రాల్లో ఆయన నటించారు. అయితే ఆ హీరోపై ఇప్పుడు కొన్ని సంచలన వార్తలు ఆ సినిమా సర్కిల్స్ లో హల్‌చల్ చేస్తున్నాయి…ఇంతకీ ఏంటి ఆ రూమర్స్ అంటే… తన భార్య, హాలీవుడ్ నటి అంబర్ హర్డ్ ను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపాలని ప్రయత్నించినట్లు తేలింది. జానీ డెప్ నుండి తనకు విడాకులు కావాలని లంబర్ కోర్టుకెక్కింది.

అంతకు ముందే ఆమె తన తన భర్తపై గృహహింస కేసు పెట్టింది. తాజాగా వీరిద్దరూ విడాకుల కోసం కోర్టు కెక్కిన నేపథ్యంలో ఆమె స్నేహితుడు న్యూయార్క్ పోస్టు అనే పత్రికకు ఇందుకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. ‘మెసేజ్ వచ్చిన వెంటనే నేను ఆమె అపార్టుమెంటుకు వెళ్లాను. అక్కడ ఆమె ముఖంపై కమిలిన గాయాలు కనిపించాయి. పెదవిపై గాయమైంది. కన్ను ప్రాంతంలో కొట్టడంతో ఆ వైపు వాచిపోయింది. జుట్టు ఊడిపోయి కనిపించింది అంటూ తెలిపాడు…ఇక ఈ ఘటనతో ఆమెకు అన్నివైపుల నుంచి మద్దతు పెరుగుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus