పాయల్ కు బాలీవూడ్ ఆఫర్ కోల్పోయిందట..!

  • March 26, 2019 / 01:09 PM IST

కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఆర్.ఎక్స్.100’. ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయబోతున్నట్టు గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా సునీల్ శెట్టి కొడుకు అహన్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రాన్ని సాజిద్ నడియద్వాల నిర్మిస్తున్నాడు. మిలాన్ లుథ్రియ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేయనున్నాడు. ఇదిలా ఉండగా ఈ రీమేక్ లో కూడా మొదట పాయల్ నే హీరోయిన్ గా అనుకున్నారట. నిజానికి పాయల్ రోల్ వలనే ‘ఆర్.ఎక్స్.100’ చిత్ర విజయంలో ప్రధాన పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. ఈ ఉద్దేశంతోనే మొదట పాయల్ ని తీసుకోవాలని భావించారట.

అయితే ఇప్పుడు పాయల్ ప్లేస్లో వేరే హీరోయిన్ ను తీసుకున్నట్టు తాజా సమాచారం. వివరాల్లోకి వెళితే… తార సుతారియా అనే క్రేజీ భామని ఈ రీమేక్ లో హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. ఈ రీమేక్ కోసం అహన్ మరియు తార తో కొన్ని వర్క్ షాప్ లు నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. 2019 సెకండ్ హాఫ్లో ‘ఆర్.ఎక్స్.100’ రీమేక్ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుందని తెలుస్తుంది. 2020 ప్రారంభంలో చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్లో ఉందట. ఏదేమైనా మన పాయల్ కి బాలీవుడ్ లో ఓ గోల్డెన్ ఛాన్స్ కోల్పోయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus