కోలీవుడ్లో భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన శంకర్!

  • May 3, 2019 / 06:19 PM IST

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో ‘భారతీయుడు2’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల హడావుడితో కమల్ కాస్త బిజీగా ఉండడం అలాగే శంకర్ కూడా ఈ చిత్రం కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను సెలెక్ట్ చేసుకునే పనిలో బిజీగా ఉండడంతో షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చారు. మొదటి షెడ్యూల్ ను దాదాపు పూర్తి చేసే సమయంలోనే ఇలా బ్రేక్ ఇచ్చారు. కమల్ పూర్తిగా ఎన్నికల హడావిడి నుండీ బయటకొచ్చిన తరువాత ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తుంది. అంతేకాదు ఇది కమల్ నటిస్తున్న ఆఖరి చిత్రం అని తెలీడంతో ఈ చిత్రం పై కమల్ అభిమానులతో పాటూ మిగిలిన ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ చిత్రం పూర్తయిన తరువాత శంకర్ ఎవరితో చిత్రం చేస్తాడనేదానిపై కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ విషయం పై సోషల్ మీడియాలో డిస్కషన్లు మొదలయ్యాయి. అయితే కోలీవుడ్ మీడియా వర్గాల నుండీ అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ డైరెక్టర్ రాజ‌మౌళి లానే శంక‌ర్ కూడా ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరోలు విజ‌య్‌, అలాగే మరో స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ లతో శంకర్ ఓ సినిమా తీయబోతున్నాడట. ప్రస్తుతం విజయ్ తన 63 వ చిత్రాన్ని అట్లీ డైరెక్షన్లో చేస్తున్నాడు. ఇక విక్రమ్ మాత్రం ప్రస్తుతం వరుస ప్లాపుల్లో ఉన్నాడు. మరి ఇది మల్టీ స్టారర్ ఏంటి అని కూడా కొందరు డిస్కషన్లు పెడుతున్నారు. ఏదేమైనా విజయ్ స్టార్ డం కి, విక్రమ్ నట విశ్వరూపానికి ఈ ప్రాజెక్ట్ సెట్టయితే ఇండియన్ బాక్సాఫీస్ మరోసారి షేకవ్వడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus