శరత్ మరార్ తో పవన్ కు విబేధాలొచ్చాయా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగానే కాక పవన్ రాజకీయ ఎంట్రీ మొదలుకొని పర్సనల్ లైఫ్ ను కూడా దగ్గరుండి మరీ పర్యవేక్షించిన వ్యక్తుల్లో వ్యాపారవేత్త-నిర్మాత శరత్ మరార్ ఒకరు. “జనసేన” పార్టీ పెట్టడం మొదలుకొని.. పార్టీ తరపున నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో పాల్గొనడంతోపాటు.. సదరు సభల నిర్వహణలో కీలకపాత్ర పోషించిన శరత్ మరార్ పబ్లిసిటీ విషయంలోనూ తన టెక్నికల్ నాలెడ్జ్ అండ్ కాంటాక్ట్స్ ను విశేషంగా వాడాడు.

పవన్ కళ్యాణ్ తో “సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు” సినిమాలు రూపొందించి భారీ నష్టాలు చవిచూసిన శరత్ మరార్.. ఆ నష్టాలను సైతం పట్టించుకోకుండా పవన్ తో స్నేహం కొనసాగించాడు. కానీ.. తాజా పరిణామాలను పరిగణలోకి తీసుకొంటే ఇద్దరికీ చెడినట్లు తెలుస్తోంది. అందువల్లే శరత్ మరార్ ను “జనసేన” పార్టీ కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. మరి ఈ గుసగుసలు ఎంతవరకూ నిజమో తెలియదు కానీ.. ఒకవేళ నిజమే అయితే గనుక పవన్ ఒక మంచి మరియు తెలివైన స్నేహితుడ్ని కోల్పోయినట్లే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus