Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ 2’ సినిమా గతవారం అంటే డిసెంబర్ 12న రిలీజ్ అయ్యింది. నిజానికి డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఆర్ధిక సమస్యల కారణంగా వారం రోజులు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఆ రిలీజ్ డేట్ కూడా 3 రోజుల ముందే ఫైనల్ అవ్వడంతో.. కొంతమంది ప్రేక్షకులకు ‘అఖండ 2’ రిలీజ్ అయినట్టు కూడా తెలీదు అంటే అతిశయోక్తి అనిపించుకోదు.

Thaman

ఓ పెద్ద సినిమాకి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా బాధాకరమే. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. సాధారణంగా తాను పనిచేసే ఏ పెద్ద సినిమాకైనా ముందు ఉండి ప్రమోట్ చేస్తుంటాడు సంగీత దర్శకుడు తమన్. ముఖ్యంగా బాలకృష్ణ సినిమా అంటే.. అతనికి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఉత్సాహంతోనే పనిచేస్తూ ఉంటాడు.. ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటూ ఉంటాడు. బాలకృష్ణతో పనిచేసిన అన్ని సినిమాలకి అతను బెస్ట్ ఔట్పుట్ ఇచ్చాడు.

‘డిక్టేటర్’ సినిమా ప్లాప్ అయినా తమన్ బీజీఎమ్ బాగుంటుంది. పాటలు కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.కానీ ఎందుకో ‘అఖండ 2’ విషయంలో తమన్ నుండి ఆశించిన ఔట్పుట్ లభించలేదు. సినిమాలో పాటలు బాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా లౌడ్ గా కొట్టాలని కొట్టినట్టు ఉంది తప్ప.. ఆడియన్స్ దాన్ని ఎంజాయ్ చేయడం లేదు. ‘అఖండ’ కి మైండ్ బ్లోయింగ్ బీజీయం ఇచ్చిన తమన్.. ‘అఖండ 2’ విషయంలో మాత్రం చేతులెత్తేశాడు.

దీనికి కారణం బోయపాటితో తమన్ కి వచ్చిన మనస్పర్థలే కారణమని అంతా చెప్పుకుంటున్నారు. నిన్న జరిగిన సక్సెస్ మీట్లో కూడా తమన్ యాక్టివ్ గా లేడు. పైగా ‘బోయపాటి గారు ఏదో 8 నెలల్లో తీసేశామని చెబుతున్నారు కానీ దాని వెనుక చాలా కష్టం ఉంది’ అంటూ ఓ సెటైర్ కూడా విసిరాడు తమన్.

‘స్కంద’ సినిమా టైంలో ‘ ‘అఖండ’ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకపోయినా సీన్స్ అన్నీ హైలెట్ గా ఉంటాయి’ అంటూ బోయపాటి.. తమన్ పనితనాన్ని తక్కువ చేసి మాట్లాడినట్టు అంతా చెప్పుకున్నారు. బహుశా ఆ విషయంలో హర్ట్ అవ్వడం వల్లే ‘అఖండ 2’ కి తమన్ సరిగ్గా వర్క్ చేయలేదేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

‘అఖండ’ వాటన్నింటికి అతీతుడు.. ఏమైనా చేయగలడు.. బోయపాటి క్లారిటీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus