సీనియర్ స్టార్ హీరోలు ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. ఒకప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్..లు మాత్రమే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ని బయ్యర్స్ ని కాపాడుతున్నారు అని చెప్పాలి. పండుగలు వస్తున్నాయి అంటే వీళ్ళ సినిమాలతోనే థియేటర్లకు ఫీడింగ్ అందుతుంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ సినిమాలు 2,3 ఏళ్ళకి ఒక్కటి అన్నట్టు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సీనియర్ స్టార్ హీరోలు ఇంకా టాప్ ఆర్డర్లో కొనసాగడానికి మంచి గ్యాప్ దక్కించుకున్నట్టు అయ్యింది. వీరిలో చిరంజీవి, బాలయ్య..ల సినిమాల మధ్య ఇప్పటికీ గట్టి పోటీ ఏర్పడుతుంది. బాలయ్య- చిరు మాస్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు. అయితే కొన్నాళ్ల నుండి చిరుతో పోలిస్తే బాలయ్య వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.కానీ ఓపెనింగ్స్ పరంగా చిరంజీవి సినిమాలు హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధిస్తున్నాయి.
సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించింది చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ అనే చెప్పాలి. ఆ సినిమా తొలి రోజు రూ.84 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు ఆ రికార్డుని మరో సీనియర్ స్టార్ హీరో బ్రేక్ చేయలేదు. ఈ క్రమంలో బాలయ్య నటించిన ‘అఖండ 2’ కచ్చితంగా ‘సైరా’ రికార్డుని బ్రేక్ చేస్తుందని అంతా భావించారు. కానీ ‘అఖండ 2’ తొలి రోజు రూ.50 కోట్ల గ్రాస్ మార్క్ వద్దే ఆగిపోయింది.
బాలయ్య- బోయపాటి…లది హ్యాట్రిక్ కాంబో కాబట్టి.. కచ్చితంగా ‘సైరా’ రికార్డుని దాటేస్తుంది అనుకుంటే.. అలా జరగలేదు. అందుకు కారణం లేకపోలేదు.అనుకున్న టైంకి ‘అఖండ 2’ రిలీజ్ కాలేదు. డిసెంబర్ 5న ఈ సినిమా కనుక రిలీజ్ అయ్యుంటే.. కచ్చితంగా ‘సైరా’ రికార్డు బ్రేక్ అయ్యేదేమో. రిలీజ్ లేట్ అవ్వడం వల్ల.. చాలా మందికి ‘అఖండ 2’ డిసెంబర్ 12న వస్తున్నట్టు తెలీదు.
మరో రీజన్ ఏంటంటే ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున రిలీజ్ అయ్యింది. దేశవ్యాప్తంగా ఆ రోజు పబ్లిక్ హాలిడే రావడం, పైగా ఆ సినిమాలో విజయ్ సేతుపతి, సుదీప్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ అంతా నటించడం వల్ల.. పాన్ ఇండియా లెవెల్లో మంచి ఓపెనింగ్స్ తీసుకోవడానికి హెల్ప్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన చిరు సినిమాలు ఏవీ కూడా ‘సైరా’ కలెక్షన్స్ కి దగ్గరగా వెళ్ళింది లేదు.