పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో ‘ది రాజాసాబ్'(The Rajasaab) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇదొక హర్రర్ కామెడీ మూవీ. అలాగే ప్రభాస్ ఇమేజ్ తగ్గ మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయని టీజర్, ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ కి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఆ సాంగ్ ఆశించిన స్థాయిలో అభిమానులను, మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకోలేదు. అలాగే ట్రైలర్ కి కూడా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ సింగిల్ ప్రోమోని కూడా నిన్న విడుదల చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. మరోవైపు రీ- షూట్లు వంటి హడావిడి కూడా నడుస్తుంది. ‘ది రాజాసాబ్’ మేకర్స్ వద్ద ప్రాపర్ ప్రమోషన్స్ ప్లాన్ లేనట్టే కనిపిస్తోంది.ఈ క్రమంలో ఈ సినిమాని డిసెంబర్ 5 నుండి పోస్ట్ పోన్ చేయడం మంచిదే అయ్యింది అని టాక్ వినిపిస్తుంది.
ఎందుకంటే.. అదే రోజున బాలీవుడ్లో ‘ధురంధర్’ సినిమా రిలీజ్ అయ్యింది. రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడ మంచి వసూళ్లు రాబడుతుంది. కంటెంట్ కూడా ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. మరోవైపు బాలకృష్ణ- బోయపాటి శ్రీను..ల ‘అఖండ 2’ సినిమాని భారీగా ప్రమోట్ చేసి రిలీజ్ చేసినా.. అక్కడి ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. కాబట్టి.. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ‘ది రాజాసాబ్’ కనుక రిలీజ్ అయ్యి ఉండుంటే.. ‘ధురంధర్’ వల్ల గట్టి పోటీ ఎదురయ్యేది.
ఓపెనింగ్స్ పై కూడా గట్టి ప్రభావం పడుండేది. మరోవైపు జనవరి 9న రిలీజ్ అవుతున్నప్పటికీ ‘ది రాజాసాబ్’ పై బజ్ లేదు. సాంగ్స్ ఆకట్టుకోలేదు. మరో మంచి ట్రైలర్ కట్ చేసి వదిల్తే తప్ప.. ‘ది రాజాసాబ్’ సంక్రాంతి బరిలో నిలదొక్కుకోవడం కష్టమే అని చెప్పడంలో సందేహం లేదు. మరోపక్క ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ‘అనగనగా ఒక రాజు’ సినిమా యూనిట్లు మాత్రం తమ సినిమాలను తెగ ప్రమోట్ చేస్తున్నారు. వాటి కంటెంట్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో ‘ది రాజాసాబ్’ టీం ప్రమోషన్స్ జోరు పెంచకపోతే కష్టమే..!