Mahesh Babu: ‘మైత్రి’ తో మహేష్ కు చెడిందా..!

సాధారణంగా పెద్ద నిర్మాణ సంస్థలో సినిమాలు చేసే హీరోలకి అగ్రిమెంట్ పై సైన్ చేసే ముందే కొన్ని నియమాలు ఉంటాయి. తన సినిమా పూర్తయ్యేలోపు ఆ నిర్మాణ సంస్థ నిర్మించే చిన్న, మిడ్ రేంజ్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లకి కూడా గెస్ట్ లు గా వెళ్ళాలి అనేది ఆ అగ్రిమెంట్లో ఒక రూల్. నిర్మాతలు ఆ బడా హీరోలకు చెల్లించే పారితోషికంలో ఇది కూడా భాగమై ఉంటుంది.

అలాగే ఆ చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాక కూడా వాటి పై పాజిటివ్ గా ఓ ట్వీట్ వేయాల్సి ఉంటుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మాతలు ఇది పర్ఫెక్ట్ గా ఫాలో అవుతూ ఉంటారు. ‘సర్కారు వారి పాట’ సినిమా పూర్తయ్యేలోపు మహేష్ తో తమ ‘ఉప్పెన’ ‘పుష్ప’ సినిమాలకి అలాగే ప్రమోషన్లు చేయించుకున్నారు.’పుష్ప’ కి మిక్స్డ్ టాక్ వచ్చినా మహేష్ తో ట్వీట్ వేయించుకున్నారు. కాకపోతే ‘సర్కారు వారి పాట’ ప్రమోషన్ల విషయంలో తమ హీరోలతో ట్వీట్లు వేయించలేకపోయారు.

అసలు సినిమా రిలీజ్ తర్వాత ప్రమోషన్లు కూడా సరైన విధంగా చేయలేకపోయారు. 3 వారాలు పూర్తయ్యేసరికే రెంట్ పద్ధతిలో అమెజాన్ లో వదిలేశారు. ఇక్కడ ప్రమోషన్ల కోసం మహేష్ బాబు, 14 రీల్స్ వారే ఖర్చుపెట్టినట్లు భోగట్టా. ఈ కారణాలతో మహేష్ కు.. ‘మైత్రి’ కి చెడింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ‘అంటే సుందరానికీ!’ ప్రీ రిలీజ్ వేడుకకు మహేష్ బాబుని గెస్ట్ గా ఆహ్వానించాలి అని ఆ చిత్రం దర్శకుడు వివేక్ ఆత్రేయ, నాని లు అనుకున్నారు.

కాకపోతే మహేష్ ఈ వేడుకకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో ఈ విషయాన్ని ‘మైత్రి’ వారు ప్రెస్టీజియస్ గా తీసుకుని పవన్ కళ్యాణ్ ను సంప్రదించి తీసుకొస్తున్నారు అని తెలుస్తుంది. ఈ బ్యానర్లో పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. ఆ ఆబ్లిగేషన్ పైనే పవన్ ‘అంటే సుందరానికీ’ ప్రీ రిలీజ్ వేడుకకు రావడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus