Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

2026 సంక్రాంతి కానుకగా ఈసారి 7 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.ప్రభాస్ ‘ది రాజసాబ్’, చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’..వంటి స్ట్రైట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు ‘జన నాయకుడు’, ‘పరాశక్తి’ వంటి డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Jana Nayagan

ఈ సినిమాలు అన్నీ క్రేజీ ప్రాజెక్టులే. సాధారణంగా సంక్రాంతికి 4 సినిమాలు వచ్చినా ఆడియన్స్ చూస్తారు. మెజారిటీ ఆడియన్స్ ఒకటి, రెండు చూస్తారు. తర్వాతి వారానికి మిగిలిన సినిమాల్లో బాగున్న వాటిని చూస్తారు. కానీ ఈసారి 7 సినిమాలు వస్తున్నాయి. అన్నిటికీ న్యాయం జరగడం కష్టమే. మేజర్ గా చూసుకుంటే..ప్రభాస్ ‘రాజాసాబ్’, చిరంజీవి ‘శంకర్ వరప్రసాద్’ సినిమాలు మస్ట్ గా చూస్తారు.

నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ కి కూడా టికెట్లు బాగానే తెగుతాయి అనే కాన్ఫిడెన్స్ ఉంది.ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమా జనవరి 9న రిలీజ్ కాబోతోంది. బిగ్ బడ్జెట్ సినిమా కాబట్టి.. దీనికి మొదటి రోజు స్పేస్ కావాలి. కానీ అదే రోజున డబ్బింగ్ సినిమా విజయ్ ‘జన నాయకుడు’ని రంగంలోకి దింపేందుకు నిర్మాత నాగ వంశీ రెడీ అవుతున్నాడు.

ఇది ‘ది రాజాసాబ్’ కలెక్షన్స్ ని డామినేట్ చేసే అవకాశం ఉంది. అందుకే ‘జన నాయకుడు’ ని పోస్ట్ పోన్ చేయమని బయ్యర్స్ నుండి నాగవంశీకి రిక్వెస్టులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ‘జన నాయకుడు’ తెలుగు వెర్షన్ ని వాయిదా వేసేందుకు అతను రెడీ అయ్యాడు. అది కూడా ఒక్క రోజు.. పోస్ట్ పోన్ చేసేందుకు రెడీ అయ్యాడు. అంటే జనవరి 10న ‘జన నాయకుడు’ తెలుగు వెర్షన్ రిలీజ్ కానుందని తెలుస్తుంది.

ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus