డిఫరెంట్ మిస్టరీ థ్రిల్లర్ రహస్య.. ఫస్ట్ లుక్ విడుదల

ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తీసిన సినిమాలకు విజయం వరించడం ఖాయం అని ఇప్పటికే ఎన్నో సినిమాలు రుజువు చేశాయి. కంటెంట్ లో ప్రత్యేకత ఉండాలే గానీ అది చిన్న సినిమా అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుండటం చూస్తున్నాం. మిస్టరీ థ్రిల్లింగ్ సినిమాల పట్ల ఆసక్తి చూపుతున్నారు నేటితరం ఆడియన్స్. దర్శకనిర్మాతలు సైతం అదే కోణంలో సినిమాలు రూపొందిస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. ఇదే బాటలో ఇప్పుడు రహస్య అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ కంటెంట్ తో కథ సిద్ధం చేసి ఈ రహస్య సినిమాను రూపొందిస్తున్నారు. నివాస్ శిస్ట్, సారా ఆచార్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు శివ శ్రీ మీగడ దర్శకత్వం వహిస్తుండగా.. గౌతమి.S నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. సునీల్ కశ్యప్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. సెల్వకుమార్ DOP హైలైట్ కానుందట. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ కోణాలను టచ్ చేస్తూ సస్పెన్స్ మిస్టరీని ప్రేక్షకుల ముందుంచబోతున్నారు. మనిషికి, మంచానికి ఉండే సంబంధాన్ని డిఫరెంట్ వే లో ప్రెజెంట్ చేయబోతున్నారు.

SSS ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. కంటెంట్ కి తగ్గ లొకేషన్స్ లో సినిమాను షూట్ చేశారు. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతి కలిగించాలని టార్గెట్ పెట్టుకున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు. అతిత్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.

చిత్రంలో బుగతా సత్యనారాయణ, గెద్ద వరప్రసాద్, దాసరి తిరుపతి నాయుడు, వేద భాస్కర్, కారం వినయ్ ప్రసాద్, సూరి బాబు, పాండు రంగారావు, ప్రదీప్, మోడల్ శ్రీను, రాజేశ్వరి, మధు, నల్ల శ్రీను, B.T. రావ్, T.V. రామన్, A.V. ప్రసాద్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus