Krithi Shetty: రెండేళ్ల నాటి మూడు సినిమాలు.. ఇప్పుడు ఒకే నెలలో.. దీంతో కెరీర్‌ తేలిపోతుందా?

‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమనాన్ని పొందిన కృతి శెట్టి.. ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో ఇబ్బందులు పడింది. ‘శ్యామ్‌ సింగ రాయ్‌’, ‘బంగార్రాజు’ తప్పిస్తే.. ఏ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో కృతి కెరీర్‌ ఇక అయిపోయింది అనుకున్నారంతా. అయితే ఆమె ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నప్పుడు ఓకే చేసిన కొన్ని సినిమాలు ఇప్పుడు ఆమె కెరీర్‌ను తేల్చే పనిలో ఉన్నాయి. అవును 2022 ఆఖరులో, 2023 ప్రారంభంలో కృతి శెట్టి ఓకే చేసిన మూడు తమిళ సినిమాలు ఇప్పుడు ఒకే నెలలో విడుదల కాబోతున్నాయి.

Krithi Shetty

కృతి శెట్టి సినిమాల లైనప్‌ చూస్తే.. ఆమె చేతిలో ‘వా వాతియార్‌’, ‘లవ్ ఇన్సూరెన్స్‌ కంపెనీ’, ‘జీనీ’ ఉన్నాయి. కార్తి హీరోగా రూపొందుతున్న ‘వా వాతియార్‌’ సినిమాను 2023 అక్టోబరులో అనౌన్స్‌ చేశారు. ఇక ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ సినిమా అయితే 2019లో అనౌన్స్‌ చేశారు. తొలుత శివ కార్తికేయన్‌ హీరోగా అనుకోగా 2023లో ప్రదీప్‌ రంగనాథన్‌ వచ్చాడు. ఇక ‘జీనీ’ సినిమాను జయం రవి 2023 జులైలో అనౌన్స్‌ చేశారు. అప్పుడు మొదలైన ఈ సినిమాలు ఇప్పటికి విడుదలకు సిద్ధమయ్యాయి.

ఇక సినిమాల రిలీజ్‌ల విషయానికొస్తే ఈ ఏడాది డిసెంబరు మొత్తం ఆమె సినిమాలే వచ్చేలా ఉన్నాయి. తొలి వారంలో ‘వా వాతియార్‌’ రానుండగా.. మూడో వారంలో ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ సినిమాను రిలీజ్‌ చేయనున్నారు. ఇక ‘జీనీ’ సినిమాను నాలుగో వారంలో రిలీజ్‌ చేయాలని జయం రవి అనుకుంటున్నారట. అలా డిసెంబరు మొత్తం కృతి శెట్టి మ్యాజిక్కే నడవనుంది అని చెప్పొచ్చు. ఏదైనా సినిమా వాయిదా పడితే తప్ప. అన్నట్లు ఈ సినిమాలు కాకుండా ఆమెకు సౌత్‌ సినిమాలేవీ లేవు.

దీంతో హిందీ దృష్టి పెట్టిన కృతి శెట్టి బాలీవుడ్‌కి మరోసారి ట్రిప్పేస్తోంది. ప్రముఖ హిందీ నటుడు గొవిందా కుమారుడు యశ్వర్ధన్‌ అహుజా హీరోగా ఓ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఆ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టిని ఓకే చేశారట. సాజిద్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తారని వార్తలొస్తున్న ఈ ప్రాజెక్ట్‌.. ఓ సౌత్‌ సినిమాకు రీమేక్‌ అని చెబుతున్నారు. హృతిక్‌ రోషన్‌ హీరోగా తెరకెక్కిన ‘సూపర్‌ 30’ సినిమాతో ఆరేళ్ల క్రితం నటిగా కెరీర్‌ ప్రారంభించింది కృతి శెట్టి. ఆ సినిమాలో ఓ చిన్న పాత్రలోనే కనిపించింది. ఇప్పుడు ఈ సినిమాతో అక్కడ హీరోయిన్‌గా కెరీర్‌ స్టార్‌ చేస్తోందట.

ఈ విషయాలు మరచిపోయి దీపికను అన్నేసి మాటలు అంటున్నారా? గతంలో …

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus