ఐకాన్ మిస్సైనా…పింక్ ని గిఫ్టుగా ఇచ్చిన దిల్ రాజు

దర్శకుడు వేణు శ్రీరామ్ ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లయింది.ఇన్నేళ్ళలో ఆయన చేసింది కేవలం రెండు చిత్రాలే.ఆయన చేసిన మొదటి చిత్రం ఓ మై ఫ్రెండ్ పరాజయం పాలైంది. ఆరేళ్ళ తరువాత డైరెక్టర్ గా మరో అవకాశం ఇచ్చిన దిల్ రాజు నాని హీరోగా ఎం సి ఏ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చారు. ఆ చిత్రం ఆయనకు ఓ మోస్తరు విజయాన్ని అందించింది. అంత గొప్ప ట్రాక్ రికార్డు లేకున్నప్పటికీ మళ్ళీ దిల్ రాజు ఆయన్ని నమ్మి బన్నీ లాంటి స్టార్ హీరోతో ఓ చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు.ఈ చిత్రం పై కొన్ని అనధికారిక ప్రకటనలు కూడా వెలువడ్డాయి. ఐతే బన్నీ సుకుమార్ వైపు మొగ్గు చూపడంతో ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది.

కాగా ఈ దర్శకుడుకి బన్నీ తో మూవీ మిస్సయినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా సెట్ చేశారు దిల్ రాజు .హిందీ హిట్ మూవీ పింక్ తెలుగు రిమేక్ ని దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కాగా పవన్ వచ్చి సెట్స్ లో జాయిన్ కావడమే మిగిలివుంది. ఆ విధంగా నిర్మాత దిల్ రాజు దర్శకుడు వేణు శ్రీరామ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏ దర్శకుడికైనా పవన్ తో సినిమా అంటే, అది అద్భుత అవకాశం అని చెప్పవచ్చు.అలాంటిది పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ డైరెక్టర్ చేసే అవకాశం కల్పించిన దిల్ రాజుకి వేణు శ్రీరామ్ చాలా రుణపడి ఉన్నాడు. పింక్ రిమేక్ కి సంగీతం థమన్ అందిస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus