ఆరు నెలల్లో అవ్వాల్సిన సినిమా… ఏడు నెలలు అయితే ఓకే.. ఎనిమిది నెలల అయితే ఫర్వాలేదు. అదే నెలల తరబడి అలానే ఉండిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇటు నిర్మాతకు, అటు హీరోకు సంకటంలా తయారవుతుంది. ఓకే చేసిన సినిమాలు లైన్‌లో ఉండిపోయి హీరోకు, డబ్బులకు వడ్డీలు, కాల్‌షీట్లు, డేట్లు లెక్క తెలియక నిర్మాత ఇబ్బంది పడుతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలాంటి పరిస్థితి దాదాపుగా ఎదుర్కొంటున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’.
రామ్ చరణ్ – శంకర్ – దిల్ రాజు కాంబినేషన్‌లో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం ఇది. దిల్ రాజు ప్రొడక్షన్‌లో 50వ సినిమా ఇది అనే విషయం తెలిసిందే. అయితే సినిమా మొదలుపెట్టినప్పుడే ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తవుతుందా అనే ప్రశ్న వినిపించింది. అయితే అనూహ్యంగా దర్శకుడు శంకర్ శరవేగంగా తొలి షెడ్యూల్ పూర్తి చేసేశారు. దీంతో సినిమా అయిపోతుంది అని అనుకున్నారంతా. సరిగ్గా ఆ సమయంలోనే కమల్ హాసన్ ‘విక్రమ్’ వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది.
దీంతో ‘గేమ్ ఛేంజర్’ 9Game Changer) సినిమాకు పెద్ద లాస్ వచ్చిది. ‘విక్రమ్’ సాధించిన భారీ విజయంతో కమల్ తిరిగి యాక్టివ్ అయ్యారు. ఎప్పుడో ఆగిపోయిన శంకర్ సినిమా ‘భారతీయుడు 2’ను మళ్లీ పట్టాలెక్కిద్దాం అనుకున్నారు. ముందుగా చేసుకున్న ఆలోచనలు, మర్యాదలు లాంటి కారణాలతో శంకర్ ‘గేమ్ ఛేంజర్’కు గ్యాప్ ఇచ్చి.. ‘భారతీయుడు’ సినిమాను రీస్టార్ట్ చేశారు. అయితే ‘గేమ్ ఛేంజర్’ అప్పుడప్పుడు తీస్తూ వచ్చారు. కానీ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి.
ఈ లోపు చరణ్ వ్యక్తిగత కారణాల వల్ల సినిమాకు గ్యాప్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకుని ‘గేమ్ ఛేంజర్’ను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట. అంతేకాదు వచ్చే ఫిబ్రవరి కల్లా సినిమా పూర్తి చేయాలని అనుకుంటున్నాడట. ఈ మేరకు దర్శకనిర్మాతలకు క్లారిటీ ఇచ్చేశాడట. బుచ్చిబాబు సానా సినిమా స్టార్ట్ చేసేయాలని, అందుకే రాబోయే మూడు నెలల్లో సినిమా పూర్తయిపోవాలి అని చరణ్ అనుకుంటున్నాడట. అన్నట్టు దిల్ రాజు ఆలోచన కూడా అదేనట. దీంతో శంకర్‌కు డెడ్‌లైన్ పెడితేనే పని అవుతుందేమో అనే చతుర్లు కూడా వినిపిస్తున్నాయి.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!