Dil Raju: దిల్‌ రాజు పాన్‌ ఇండియా ప్రొడ్యూసర్‌ అయిపోయారా!

  • May 25, 2022 / 04:52 PM IST

డిస్ట్రిబ్యూటర్‌గా జీవితం ప్రారంభించి, నిర్మాతగా మారి.. చిన్న చిన్నగా సినిమాలు చేసుకుంటూ ఇప్పుడు స్టార్‌ ప్రొడ్యూసర్‌ అయిపోయారు దిల్‌ రాజు. ఇప్పుడు పాన్‌ ఇండియా ప్రొడ్యూసర్‌ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా తన బ్యానర్‌లోకి ఇతర వుడ్స్‌ హీరోలను ఇన్వైట్‌ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్‌లో సినిమాలు చేసిన దిల్‌ రాజు నెక్స్ట్‌ కోలీవుడ్‌లో అడుగుపెట్టారు. నెక్స్ట్‌ విజిట్‌ శాండిల్‌ వుడ్‌ అని టాక్‌. అది కూడా యశ్‌ లాంటి స్టార్‌ హీరోతో అంటున్నారు.

‘కేజీయఫ్‌’ సినిమాలతో యశ్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా హీరో అయిపోయారు. ప్రభాస్‌ లాగా ఇప్పుడు చేయబోయే సినిమాలన్నీ పాన్‌ ఇండియావే అవ్వాలని అనధికారిక నియమం పెట్టుకున్నారట. ఈ క్రమంలో ‘కేజీయఫ్‌ 2’ తర్వాతి సినిమాను ఇంకా అనౌన్స్‌ చేయలేదు. త్వరలో ఈ అనౌన్స్‌మెంట్‌ ఉంటుందని టాక్‌. అది కూడా ఎవరూ ఊహించని హీరో – ప్రొడ్యూసర్‌ కాంబో అంటున్నారు. ప్రస్తుతం శాండిల్‌ వుడ్‌లో దీని గురించే చర్చ నడుస్తోంది. యశ్‌ తర్వాతి సినిమాకు దర్శకుడు ఎవరు అనేది ఇంకా తేలలేదు కానీ..

కొన్ని రోజులుగా నిర్మాత పేరు మాత్రం వినిపిస్తోంది. ‘కేజీయఫ్‌’ లాంటి హిట్‌ సినిమాలు ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్‌ నిర్మాణంలోనే యశ్‌ తర్వాతి సినిమా అంటున్నారు. అయితే ఇప్పుడు ఆ సినిమాకు మరో నిర్మాత యాడ్‌ అవుతున్నారట. అతనే దిల్ రాజు. అంటే రెండు ప్రొడక్షన్‌ హౌస్‌లు కలిసి సినిమా చేస్తాయి అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే దర్శకుడు ఆటోమేటిగ్గా తెలుగు నుండి ఉంటారు అని చెప్పేయొచ్చు. ఎందుకంటే హోంబలే ఫిల్మ్స్‌ ఇప్పుడు భారీ సినిమాలు చేసే పరిస్థిలోనే ఉంది.

వారికి వేరే నిర్మాత సాయం అక్కర్లేదు. దిల్‌ రాజు ఆ సినిమా నిర్మాణంలోకి వస్తున్నారంటే తెలుగు లేదా తమిళ స్టార్‌ డైరక్టర్‌ ఎవరో ఈ సినిమాలోకి వస్తున్నారు అని చెప్పొచ్చు. ఓ వారంలోగా ఈ విషయమ్మీద క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు. సో వెయిట్‌ ఫర్‌ ది వండర్‌ఫుల్‌ అనౌన్స్‌మెంట్‌. తమిళంలో దిల్‌ రాజు ఇప్పటికే విజయ్‌, ధనుష్‌తో సినిమాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus