దిల్‌రాజు కన్నుపడింది..!

  • March 25, 2016 / 11:53 AM IST

తన కెరీర్‌లో వవన్‌కళ్యాణ్‌తో సినిమా తీయడమే తన అంతిమ లక్ష్యంగా చెప్పుకున్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌రాజు పవన్‌కు తగ్గ స్టోరీ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కానీ పవన్‌ ఇమేజ్‌కు తగ్గ స్టోరీ మాత్రం ఇప్పటివరకు అతనికి దొరకలేదు. దీంతో దిల్‌రాజు ఏప్రిల్‌ 14న తమిళ సంవత్సరాది కానుకగా విడుదలకు సిద్దమవుతోన్న తమిళస్టార్‌ విజయ్‌ నటిస్తున్న ‘తేరీ’ చిత్రంపై కన్నేశాడు. ఈ చిత్రం డబ్బింగ్‌ హక్కులతో పాటు వీలుంటే రీమేక్‌ చేయడానికి కూడా ఆయన సిద్దమైపోయి తమిళ నిర్మాతల నుండి ఈ చిత్రం హక్కులను పొందాడని,విజయ్‌ చిత్రాలకు తెలుగులో డిమాండ్‌ లేనప్పటికీ కేవలం సినిమా హిట్‌ అయితే పవన్‌తో ఈచిత్రాన్ని రీమేక్‌ చేయాలనే దూరదృష్టితోనే ఆయన ఈ చిత్రం రైట్స్‌ను కొనుగోలు చేశాడని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus