Dil Raju: నాకున్న వ్యాపకం అదొక్కటే.. అందుకే రెండో పెళ్లి చేసుకున్న: దిల్ రాజు

  • November 29, 2022 / 07:07 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా, ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి సినిమాలను నిర్మిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన రెండవ పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.దిల్ రాజు మొదట అనిత అనే మహిళను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వీరిద్దరికీ హన్షిత అనే కుమార్తె కూడా ఉంది.

ఇలా వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోవడమే కాకుండా తన కుమార్తెకు కూడా వివాహం చేసి తన కుటుంబంతో ఎంతో సంతోషంగా గడిపేవారు. అయితే ఉన్న ఫలంగా 2017 వ సంవత్సరంలో అనిత గుండెపోటుతో మరణించారు. ఇలా తన భార్య మరణించడంతో దిల్ రాజు ఎంతో స్ట్రగుల్ అయ్యానని తెలిపారు. ఆ సమయంలో కూతురు అల్లుడు నా వద్ద ఉన్నారు. ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నం చేశాను.

నాకున్న వ్యాపకం ఒక్కటే గ్యాంబ్లింగ్. నన్ను అలా చూస్తూ మా పేరెంట్స్ ఉండలేకపోయారు..నా పేరెంట్స్ నన్ను రెండో పెళ్లి చేసుకోమని చాలా ఒత్తిడి చేశారు. ఇక నా కుమార్తె సపోర్ట్ కూడా ఉంది. నా నిర్ణయంతో నా ఫ్యామిలీ డిస్టర్బ్ కాకూడదన్న ఆలోచనతోనే తాను రెండవ పెళ్లి చేసుకున్నానని తెలియజేశారు. ఈ విధంగా కరోనా సమయంలో తేజస్విని అనే అమ్మాయిని కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో దిల్ రాజు రెండవ పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చారు.

ఇక ఈ దంపతులకు కూడా కుమారుడు జన్మించగా తన మొదటి భార్య రెండవ భార్య ఇద్దరు పేర్లు కలిసొచ్చేలా తన కుమారుడికి అన్వయ్ రెడ్డి అని నామకరణం చేశారు. ఇలా రెండవ పెళ్లి గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus