Dil Raju: కేరవాన్ కల్చర్ వల్ల డిసిప్లేన్ పోయింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన దిల్ రాజు!

  • November 29, 2022 / 05:49 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఒకప్పుడు కేవలం తెలుగు సినిమాలను మాత్రమే నిర్మించే ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో దిల్ రాజు ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే దిల్ రాజు తాజాగా విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న వారసుడు సినిమా విషయంపై ఎన్నో వివాదాలను ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ నిర్వహించిన ఈయన ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో విషయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న క్యారవాన్ కల్చర్ గురించి ఈయన షాకింగ్ కామెంట్ చేశారు. గతంలో కూడా ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కేరవాన్ కల్చర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ కల్చర్ కారణంగా ఎంతో సమయం వృధా అవుతుందని తెలిపారు.

ఒక షాట్ పూర్తి కాగానే హీరో హీరోయిన్లు వెళ్లి తమ క్యారవాన్ లో రిలాక్స్ అవుతూ ఉంటారు. తిరిగి మరి షాట్ రెడీ అయిన తర్వాత ముందుగా హీరో హీరోయిన్ల అసిస్టెంట్ లను పిలిచి వారికి చెప్పి పంపించాలి. వారు వెళ్లి హీరో హీరోయిన్లకు చెప్పగా వారు వచ్చే సమయానికి సుమారు 15 నిమిషాల సమయం పడుతుందని తెలిపారు.ఈ కల్చర్ కారణంగా హీరో హీరోయిన్లకు డిసిప్లిన్ కూడా పోతుంది అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus