‘మహర్షి’ చిత్రానికి ‘పోకిరి’ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 చిత్రంగా తెరకెక్కుతోన్న ‘మహర్షి’ చిత్రం పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. 2019 లో ‘వినయ విధేయ రామా’ తరువాత రాబోతున్న పెద్ద చిత్రం ఇదే కావడం.. అందులోనూ.. సమ్మర్ కానుకగా విడుదల కాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, అశ్వినీ దత్, ప్రసాద్ వి పొట్లూరి కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలనీ భావించినప్పటికీ కొన్ని కారణాల వలన రిలీజ్ వాయిదా పడిందంటూ గత కొంతకాలం నుండీ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చడు దిల్ రాజు. ఇటీవల వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి తిరుమలకి వెళ్ళిన దిల్ రాజు ‘మహర్షి’ చిత్ర రిలీజ్ డేట్ ను ప్రకటించేశాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్లు ఖరారు చేసేసాడు. సమ్మర్ సీజన్ కావడంతో మహేష్ సినిమా మంచి రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుందనే చెప్పాలి. ఏప్రిల్ 18న లారెన్స్ ‘కాంచన 3’, నాని ‘జెర్సీ’ ఏప్రిల్ 19న రాబోతున్నాయి. ఆ తదుపరి వారమే మహేష్ సినిమా రాబోతుండడం విశేషం.

గతంలో ‘పోకిరి’ చిత్రం ఏప్రిల్ 28 న విడుదలయ్యి ఇండస్ట్రీ హిట్ అయ్యింది.. అలాగే ‘భరత్ అనే నేను’ చిత్రం కూడా ఏప్రిల్ 20 న విడుదల అయ్యి.. వరుస డిజాస్టర్లతో సతమత మవుతున్న మహేష్ కి సూపర్ హిట్ ఇచ్చింది. సో ‘మహర్షి’ చిత్రం కూడా ఏప్రిల్ 25 న రాబోతుండడంతో… ఈ సమ్మర్ లో కూడా మహేష్ సినిమా హిట్టు కొట్టడం ఖాయమని భావిస్తున్నారు అభిమానులు. ఇక ఈ చిత్రంతో పాటు దిల్ రాజు లైన్ లో మరో నాలుగు సినిమాలు ఉన్నట్లు వెల్లడించాడు. ఆ నాలుగు కూడా ఈ ఏడాదిలోనే విడుదల చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక ‘మహర్షి’ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్దే నటిస్తుండగా… అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus