‘శతమానంభవతి’ సక్సెస్ పై కొత్త స్ట్రాటజీ!!!

  • December 20, 2016 / 07:54 AM IST

టాలీవుడ్ లో టాప్ నిర్మాతల పేరు చెప్పమంటే అందులో దిల్ రాజు పేరు ఖచ్చితంగా ఉంటుంది..టైమింగ్, మంచి డిసిషన్ మేకింగ్, కధను ఎంచుకోవడం, కధకు తగ్గట్టు బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించడం దిల్ రాజు స్టైల్….బహుశా అందువల్లనే ఇంత విపరీతమైన పోటీ వాతావరణంలో కూడ దిల్ రాజ్ సక్సస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నాడు.  అయితే అదంతా పక్కన పెడితే…..అసలు దిల్ రాజు స్ట్రాటజీ రాబోతున్న సంక్రాంతికి తెలుస్తుంది ఆన్ టాక్ టాలీవుడ్ లో బలంగా వినిపిస్తుంది..దానికి కారణం….సంక్రాంతి బరిలో  ‘ఖైదీ’ ‘శాతకర్ణి’ సినిమాలు సంక్రాంతి వార్ కు రెడీ అవుతూ ఉంటే మధ్యలో దిల్ రాజ్ తన సినిమా ‘శతమానం భవతి’ ని సంక్రాంతి సినిమాల పోటీలో నిలబడటం అంటున్నారు టాలీవుడ్ వాళ్ళు…అయితే ఇంతకీ దిల్ రాజు ఎందుకంత రిస్క్ చేస్తున్నాడు….అసలు ఆది కాన్ఫిడెన్స్ నా…లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా?? అంటే….అసలు కధ అక్కడే ఉంది….విషయంలోకి వెళితే…రెండు టాప్ హీరోల మధ్య తన ‘శతమానం భవతి’ ని దిల్ రాజ్ పక్కా ప్లాన్ తో అర్బన్ అండ్ ఓవర్ సీస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసే విధంగా రూపొందించాడు అని తెలుస్తోంది.

విదేశాల్లో పిల్లలు ఉండి ఇక్కడ అభిమానాలకు దూరమైన ఒక జంట తమ పిల్లల్లందర్నీ రప్పించాలని తాము విడాకులు తీసుకుంటున్నామని చెప్పి మొత్తం తమ పిల్లలందరినీ ఇండియాకు రప్పించడం ఇక్కడ అభిమానాలు, పల్లెటూర్లు, పండగలు ఇలా అన్నీ పెర్ ఫెక్ట్ గా మిక్స్ చేసాడట దిల్ రాజ్. తక్కువ బడ్జెట్ తో చాలా కలర్ఫుల్ గా ఈ సినిమాను తెరకెక్కించడట మన దిల్ రాజు…దీనికితోడు సంక్రాంతి భోగి మంట‌లు, కొత్త బ‌ట్ట‌లు, హ‌రిదాసులు. ఇలా పల్లెటూరులో సంక్రాంతి ఎలా ఉంటుందో చాల చక్కగా దిల్ రాజ్ ఈమూవీలో చూపెడుతూ ఉండటంతో తక్కువ బడ్జెట్ తో దిల్ రాజ్ చేస్తున్న ప్రయోగం సక్సస్ కావడమే కాకుండా చిరంజీవి బాలయ్యల సినిమాల మధ్య అతి సులువుగా విజయం సాధిస్తుంది అన్న పాజిటివ్ కామెంట్స్ అప్పుడే మొదలైపోయాయి. ఇంతవరకూ బాగానే ఉంది కానీ..రెండు సునామీల మధ్య ఎంత బావున్నా సినిమా ఓపెనింగ్స్ కాస్త కష్టమే అనేది ఒప్పుకోక తప్పని నిజం…చూద్దాం మరి ఏం జరుగుతుందో…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus