దిల్ రాజు బ్యానర్ లో నిఖిల్ సినిమా!

పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చిరంజీవి లాంటివారు మినహా అందరు అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించిన దిల్ రాజు ప్రస్తుతం యువ కథానాయకులపై దృష్టిస్తారిస్తున్నాడు. నాని, శర్వానంద్ లాంటి క్రేజీ స్టార్లతో వరుసబెట్టి సినిమాలు నిర్మిస్తున్న దిల్ రాజు.. తాజాగా నిఖిల్ హీరోగా ఓ సినిమా నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కన్నడ సూపర్ హిట్ సినిమా “కిరిక్ పార్టీ”ని తెలుగులో రీమేక్ చేస్తున్న నిఖిల్ ఆ సినిమా అనంతరం తన ఫ్యావరెట్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ‘సవ్యసాచి” చిత్రాన్ని తెరకెక్కిస్తున్న చందు మొండేటి ఆ సినిమా పూర్తవ్వగానే నిఖిల్ హీరోగా తాను తెరకెక్కించే సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలెట్టానున్నాడు.

నిఖిల్ తోపాటు చందు మొండేటి కూడా సక్సెస్ ఫామ్ లో ఉండడంతో ఈ ఇద్దరి దిల్ రాజు నిర్మించబోయే సినిమాపై ఇప్పట్నుంచే భారీ అంచనాలు నమోదవ్వడం ఖాయం. 2018 మార్చి లేదా ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ కు వెళ్లనుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus