Dil Raju: ‘ఎఫ్3’ బ్రేక్ ఈవెన్ పై దిల్ రాజుకి ఇంకా ఆశలు ఉన్నాయా..!

  • June 14, 2022 / 10:26 PM IST

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. దిల్ రాజు సూపర్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ‘F2’ కి సీక్వెల్ గా రూపొందింది. 27న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ ను సంపాదించుకుని మొదటి వారం బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేసింది. కానీ ఆ తర్వాత కలెక్షన్లు తగ్గిపోయాయి. ‘విక్రమ్’ ‘మేజర్’ ‘అంటే సుందరానికీ!’వంటి చిత్రాలు ఎంటర్ అవ్వడంతో ‘ఎఫ్3’ కలెక్షన్లు తగ్గాయి. ఉన్నంతలో బాగానే కలెక్ట్ చేస్తుంది అనేది వాస్తవం కానీ బ్రేక్ ఈవెన్ అయ్యేంత రేంజ్లో అయితే పెర్ఫార్మ్ చేయడం లేదు.

ఫుల్ రన్లో ఈ చిత్రానికి రూ.8 కోట్ల నుండి రూ.9 కోట్ల వరకు నష్టాలు రావచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే దిల్ రాజు మాత్రం ‘ఎఫ్3’ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ పేరుతో ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేసి ఈ మూవీ బ్లాక్ బస్టర్ అనే కలరింగ్ ఇచ్చారు. ” ‘ఎఫ్ 3’ తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో అద్భుతమైన విజయం సాధించింది. దర్శకుడు అనిల్ రావిపూడితో 5 విజయవంతమైన సినిమాలు పూర్తయ్యాయి. డబుల్ హ్యాట్రిక్ కి రెడీ అవుతున్నాం.

వెంకటేష్ గారితో మూడు విజయాలు, వరుణ్ తేజ్ గారితో మూడు విజయాలు అందుకున్నాం. నిజమైన సక్సెస్ ఏది అనేది డిస్ట్రిబ్యూటర్స్ కు ఎప్పుడూ ఒక ప్రశ్నే. ‘ఎఫ్ 3’ మొదలుపెట్టిన తర్వాత పాండమిక్ వచ్చింది. దీని కారణంగా బడ్జెట్ పెరుగుతూ వచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే డిస్ట్రిబ్యూషన్ లో ఈ బడ్జెట్ లెక్కలు పరిగణలోకి తీసుకురాలేదు. మాకు పర్మినెంట్ గా వుండే డిస్ట్రిబ్యూటర్స్ తో కలసి మంచి అవగాహనతో సినిమాను విడుదల చేశాం.

నిజమైన సక్సెస్ ఎప్పుడంటే .. సినిమాని ప్రేక్షకులు బావుందన్నపుడు మాకు ఫస్ట్ ఎక్సయిట్ మెంట్, సినిమాని రోజు రోజుకు ఎంజాయ్ చేస్తూ ఆదరణ పెరుగుతున్నప్పుడు మాకు ఆనందంగా ఉంటుంది. రెండు.. మేము పెట్టిన డబ్బు వెనక్కి తిరిగి వచ్చినపుడు ఇంకా ఆనందంగా ఉంటుంది. పాండమిక్ తర్వాత అన్నీ వీకెండ్ సినిమాలైపోయాయి. శుక్ర, శని, ఆదివారాలు కలెక్షన్ వుండి తర్వాత తగ్గిపోతున్నాయి. పాండమిక్ తర్వాత సినిమాలో చాలా మార్పులు వచ్చాయి. ఇంకా రాబోతున్నాయి. దీన్ని మేము అర్థం చేసుకొని ప్లానింగ్ మార్చుకోవాలి.

ఇంత పాండమిక్ లో కూడా నిన్నటికి 17 రోజులు పూర్తయ్యి థర్డ్ వీకెండ్ కూడా ఎఫ్ 3ని ప్రేక్షకులు చూసి మాకు ఇంకా షేర్ రూపంలో డబ్బు ఇస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు” అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు. ‘ఎఫ్3’ వంటి యావరేజ్ సినిమాని బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవడం దిల్ రాజుకే చెల్లింది. 4 వ వారంలోకి ఎంటర్ అవుతున్న టైములో ఖర్చు చేసి మరీ ‘ఎఫ్3’ కోసం ఈవెంట్ పెట్టడం ఎందుకు అనేది ఆయనకే తెలియాలి. ‘ఎఫ్3’ కంటే ముందు ప్రేక్షకులకి ‘అంటే సుందరానికీ’ ‘విక్రమ్’ ‘మేజర్’ వంటి సినిమాలు ఉన్నాయి అని మర్చిపోయారో ఏమో..!

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus