Dil Raju: అనిల్ రావిపూడిపై దిల్ రాజు ఒత్తిడి.. కానీ?

బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబో మూవీకి సాహో గారపాటి నిర్మాత కాగా దిల్ రాజు ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. చాలా సంవత్సరాల క్రితమే అనిల్ రావిపూడి సాహో గారపాటికి సినిమా చేయాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. అయితే దిల్ రాజు ఎంట్రీ ఇస్తే బాలయ్య అనిల్ కాంబో మూవీ హిట్టైనా అసలు నిర్మాతలకు క్రెడిట్ దక్కే అవకాశం ఉండదు.

బాలయ్య సాహో గారపాటి కాంబో మూవీకి సహ నిర్మాతగా వ్యవహరించేలా దిల్ రాజు అనిల్ రావిపూడిపై ఒత్తిడి పెంచుతున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అనిల్ రావిపూడి దిల్ రాజు అడిగితే నో చెప్పే అవకాశం ఉండదు. ఈ సినిమా విషయంలో ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది. బాలయ్యతో ఒక సినిమాను నిర్మించాలని దిల్ రాజు చాలా సంవత్సరాల నుంచి భావిస్తుండటం గమనార్హం. మరోవైపు బాలయ్యతో అనిల్ ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కామెడీని అద్భుతంగా పండించగలిగే హీరోలలో బాలయ్య ఒకరు. అయితే బాలయ్య సినిమాలలో ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. అనిల్ బాలయ్యతో మాస్ మసాలా మూవీని తెరకెక్కిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన అనిల్ రావిపూడి భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

బాలయ్య సైతం అఖండ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. తర్వాత సినిమాలతో అఖండ సినిమాను మించిన సక్సెస్ అందుకోవాలని బాలయ్య భావిస్తున్నారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో కూడా ఒక సినిమా ఫిక్స్ అయిందని సమాచారం. కెరీర్ విషయంలో బాలయ్య ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus