Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల పారితోషికాలపై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భారీ బడ్జెట్ సినిమాల్లో స్టార్ హీరోల రెమ్యూనరేషన్ కారణంగా నిర్మాణ వ్యయాలు అమాంతం పెరుగుతున్నాయని పలువురు నిర్మాతలు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Dil Raju

ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ, సినిమా బడ్జెట్, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తాను హీరోలతో పారితోషికం గురించి చర్చిస్తానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి మార్కెట్ ఎంత ఉందో బట్టి రెమ్యూనరేషన్ నిర్ణయించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే అగ్రహీరోలు తమ ఇమేజ్ కారణంగా పారితోషికం తగ్గించేందుకు పెద్దగా ఆసక్తి చూపరని ఆయన అభిప్రాయపడ్డారు.

దిల్ రాజు వివరించిన ప్రకారం, కొన్ని భారీ ప్రాజెక్టుల్లో మొత్తం సినిమా బడ్జెట్‌లో దాదాపు మూడో వంతుకు పైగా హీరో పారితోషికానికే వెళ్తోందని చెప్పారు. దీంతో నిర్మాణ వ్యయాలు పెరగడమే కాకుండా, నిర్మాతలపై ఆర్థిక భారం కూడా అధికమవుతోందన్నారు.

ఈ సందర్భంగా బాలీవుడ్‌లో అమలవుతున్న విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావించిన ఆయన, అక్కడ చాలామంది స్టార్ హీరోలు ముందస్తు భారీ రెమ్యూనరేషన్ తీసుకోవడం కంటే, సినిమా లాభాల్లో వాటా తీసుకునే విధానాన్ని అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విధానం నిర్మాతలకు కూడా భరోసా కల్పిస్తుందని, సినిమా విజయం సాధిస్తే హీరోతో పాటు నిర్మాత కూడా లాభపడే అవకాశం ఉంటుందని చెప్పారు.

ఒకప్పుడు భారీ పారితోషికం తీసుకున్న కొందరు బాలీవుడ్ స్టార్‌లు కూడా ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ మోడల్ వైపు మళ్లారని ఆయన గుర్తుచేశారు. ఈ విధానం వల్ల సినిమాపై అందరికీ సమాన బాధ్యత ఏర్పడుతుందని, నిర్మాతలకు రిస్క్ కూడా కొంతవరకు తగ్గుతుందని వివరించారు. దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా భవిష్యత్తులో ఇలాంటి ప్రాఫిట్ షేరింగ్ విధానం అమల్లోకి వస్తుందా అనే అంశంపై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus