ఈ సంక్రాంతికి ఎప్పుడూ లేని విధంగా ఏకంగా నాలుగు స్టార్ హీరోలు పోటీపడ్డారు. నాలుగూ గట్టి పోటీలే. ఎవరు గెలుస్తారా అని ప్రేక్షకులతోపాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎదురుచూశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన “ఎన్టీఆర్”కి మంచి రెస్పాన్స్ వచ్చినా కలెక్షన్స్ రాబట్టలేక చతికిలపడగా.. “పెట్ట” పర్వాలేదనిపించుకొంది. అనంతరం విడుదలైన “వినయ విధేయ రామ” చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ.. ఇప్పటికే 50 కోట్ల షేర్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఆటలోకి ఆఖరున దిగిన “ఎఫ్ 2” మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
అయితే.. ఈ సంక్రాంతి రేస్ లో విన్నర్ ఎవర్రా అంటే వెంటనే వెంకటేష్ అనో లేక రజనీకాంత్ అనో అనుకుంటాం కానీ.. రియల్ విన్నర్ మాత్రం దిల్ రాజు. నిర్మాతగా “ఎఫ్ 2″తో సూపర్ హిట్ అందుకున్న దిల్ రాజు.. డిస్ట్రిబ్యూటర్ గా “వినయ విధేయ రామ” చిత్రంతో మంచి సక్సెస్ సొంతం చేసుకొన్నాడు. ఆల్రెడీ నైజాం లో కలెక్షన్స్ కుమ్ముతున్నాయి. సో, ఈ సంక్రాంతికి దిల్ రాజు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా డబుల్ సక్సెస్ అందుకున్నాడు. ఆ విధంగా చూస్తే ఈ సంక్రాంతి విన్నర్ దిల్ రాజు అని ఎలాంటి సందేహం లేకుండా ప్రకటించవచ్చు.