పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్'(The RajaSaab) సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ చేస్తున్న మొదటి హర్రర్ జోనర్ మూవీ ఇది. కాబట్టి కామన్ ఆడియన్స్ లో కూడా ఆసక్తి ఉంది. పైగా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మొదటి సినిమా ఇది. ఎక్కువ థియేట్రికల్ బిజినెస్ కూడా చేసింది. కాబట్టి.. ఈ సినిమాకి ప్రీమియర్ షోలు, టికెట్ హైకులు వంటివి అవసరం.
అప్పుడే మంచి ఓపెనింగ్ తీసుకుంటుంది. కానీ ఇటీవల ‘అఖండ 2’ తో చోటు చేసుకున్న పరిణామాలను బట్టి.. ఇక మీదట తెలంగాణలో ఏ సినిమాకి కూడా ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపుకి అనుమతులు ఇవ్వబడవు అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెగేసి చెప్పేసింది.
దీంతో ‘ది రాజాసాబ్’ ఓపెనింగ్స్ కి ఇబ్బంది తప్పదు అని అంతా భావించారు.నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ కూడా ‘ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని, అయితే ఆ టైంకి రిక్వెస్ట్ పెట్టుకుని.. ఒకవేళ ప్రభుత్వం కనికరిస్తే టికెట్ రేట్లు పెంచుకుంటామని, అదనపు షోలు కూడా ఉండొచ్చు’ అని చెప్పడం జరిగింది.
అయితే ఈరోజు సరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్లో ‘జనవరి 8న రాత్రి నుండి ప్రీమియర్ షోలు ఉంటాయని’ హామీ ఇచ్చేశారు విశ్వప్రసాద్. సో ఆయన బ్యాక్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఆయనకి కూడా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి అది పెద్ద విషయం కాదు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎల్.బి.స్టేడియంలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నట్టు కూడా ప్రకటించారు.