నా తండ్రి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి : దిల్ రాజు కూతురు

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. మొన్న ఆదివారం రోజున వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్ లోని నర్సింగ్ పల్లిలోని వెంకటేశ్వర స్వామి గుడిలో ఈయన రెండో పెళ్ళి గత ఆదివారం నాడు వివాహం చేసుకున్నారు.ఈ 10 మంది జనాలతో చాలా నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న వధువు పేరు తేజస్విని. ఇక దిల్ రాజు పెళ్ళికి తన కుమార్తె కూడా శుభాకాంక్షలు తెలుపడం విశేషం.

దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి తన ఇన్స్టా గ్రామ్ ద్వారా తన తండ్రికి శుభాకాంక్షలు చెప్పింది. ‘మీరు ఎల్లప్పుడూ నాకు చాలా అండగా ఉన్నారు. నన్ను సంరక్షిస్తున్నందుకు.. నిరంతరం కుటుంబ సభ్యుల ఆనందానికే ప్రాధాన్యం ఇస్తూ వచ్చినందుకు చాలా థాంక్స్. జీవితంలో మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన మీరిద్దరూ సంతోషంగా, ప్రేమతో కలిసుండాలని కోరుకుంటున్నాను.ఇకనుండీ ప్రతి రోజూ మీకు ఓ అద్భుతమైన రోజు కావాలని ఆశిస్తున్నాను. మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమించే.. మీ హన్షు’ అంటూ ఆమె పేర్కొంది.

ఇక దిల్ రాజు మొదటి భార్య అనిత… 2017 లో మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండీ దిల్ రాజు ఒంటరిగా ఉంటూ వస్తున్నారు. కూతురి కోరిక మేరకే రెండో పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది.కుటుంబ సభ్యులను కూడా ఆమెనే ఒప్పించిందట. ఇదిలా ఉండగా.. దిల్ రాజు పెళ్ళి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి .

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?

1

2

3

4

5

6

7

8

Most Recommended Video

అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus