Dil Raju: పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో దిల్ రాజు దంపతుల సందడి..!

సినీ పరిశ్రమలోని జనాలకు సెంటిమెంట్లు బాగా ఎక్కువ. ముహుర్తాలు వంటి పట్టింపులు కూడా ఎక్కువే. ఇక పండుగ సమయంలో దైవ దర్శనాలు వంటివి కూడా ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఇదే చేశారు. ఆయన సతీమణి తేజస్వినితో కలిసి పాలకొల్లులోని క్షీరరామలింగేశ్వర స్వామి గుడికి వెళ్లారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సమీపంలో రాంచరణ్ – శంకర్ ల సినిమా షూటింగ్ జరుగుతుంది. దీనికి దిల్ రాజే నిర్మాత..! ఇక్కడ రాంచరణ్-అంజలి ల పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది.

అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా..! కాబట్టి.. ఆయన ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న రాజమండ్రికి దిల్ రాజు భార్య తేజస్వి కూడా హాజరయ్యారు. ఆమె కోరిక మేరకు పాలకొల్లులో ఉన్న క్షీరరామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దిల్ రాజు వచ్చారు. ఇక్కడికి వచ్చి మొక్కితే ఏ కోరిక అయినా నెరవేరుతుంది అనే సెంటిమెంట్ జనాల్లో ఎక్కువగా ఉంటుంది.

అలాగే పిల్లాడు పుట్టిన తర్వాత దిల్ రాజు దంపతులు వచ్చి ఈ ఆలయంలో పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూజ పూర్తయిన తర్వాత పూజారులు దిల్ రాజు దంపతులను ఆశీర్వధించి ప్రసాదాలు వంటివి అందించడం కూడా మనం ఇందులో చూడొచ్చు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus