‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు కమిట్ అయ్యాడు రాంచరణ్. 2021 లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. నిర్మాత దిల్ రాజుని అడిగితే 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది అంటున్నారు. దర్శకుడు శంకర్ తో సినిమా అంటే ఇలానే ఉంటుంది. తాను సంతృప్తి చెందే వరకు షూటింగ్ చేస్తూనే ఉంటారు. ఎన్ని రోజులు షూటింగ్ చేసినా నచ్చకపోతే ఆ ఫుటేజ్ ని అంతా డస్ట్ బిన్ లో పడేస్తూ ఉంటారు.
‘గేమ్ ఛేంజర్’ విషయంలో కూడా ఇదే జరుగుతుంది అనేది ఇన్సైడ్ టాక్. వాస్తవానికి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ బయటకు రావాలి. కానీ రిలీజ్ కాలేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా తెలియని పరిస్థితి. అయితే రాంచరణ్ మాత్రం సాధ్యమైనంత త్వరగా ‘గేమ్ ఛేంజర్’ ను కంప్లీట్ చేసి బుచ్చిబాబుతో చేయాల్సిన నెక్స్ట్ ప్రాజెక్టుని మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలలోపు ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ చరణ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.
ఆ తర్వాత ఏప్రిల్ ఎండింగ్ లోపు బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ అవ్వచ్చు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకి 3 నెలలు కేటాయిస్తారు. సో ఓవరాల్ గా ఆగస్టు చివరి నాటికి ఫైనల్ కాపీ రెడీ అవ్వచ్చు. అక్కడి నుండి సినిమాని ప్రోమోట్ చేసి గాంధీ జయంతి లేదా దసరా కి ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో వారు 2 డేట్లను లాక్ చేసి అనౌన్స్ చేయాలని భావిస్తున్నారట.
అయితే సెప్టెంబర్ 27న లేదంటే అక్టోబర్ 11న లాంగ్ వీకెండ్ కలిసొచ్చేలా ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి త్వరలోనే ఈ డేట్లను లాక్ చేస్తూ అప్డేట్లు ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇంకో పెద్ద సినిమా యూనిట్ ఆ డేట్ పై కన్నేయకముందే ఫిక్స్ చేస్తారన్న మాట.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!