చిరంజీవి – విజయశాంతి.. టాలీవుడ్‌లో మోస్ట్ వైబ్రంట్, మోస్ట్ ఎనర్జిటిక్, మోస్ట్ లవబుల్ పెయిర్. ఇద్దరూ ఒక సినిమాలో ఉన్నారు అంటే.. ధమాకా ధార్ ఫర్‌ఫార్మెన్స్ పక్కా అనేవారు ఒకప్పుడు. ఆ తర్వాత ఆ స్థాయిలో అలరించిన కాంబో అయితే మనకు కనిపించలేదు. ఒకట్రెండు జోడీలు వచ్చినా ఆ స్థాయిలో కనిపించినా.. కన్సిస్టెన్సీ చూపించలేకపోయారు. దీంతో రెండు సినిమాల ముచ్చట అయిపోయారు. ఇంతటి రేంజి హైప్ ఉన్న ఈ కాంబినేషన్‌ని తన హీరోయిన్ – హీరోయిన్లకు పోల్చార యువ దర్శకుడు భాను భోగవరపు.
‘సామజవరగమన’ సినిమాతో బాక్సాఫీసు దగ్గర ననవ్వులు పూయించిన భాను భోగవరపు ఇప్పుడు నవ్వుల మాస్ మహారాజ్‌తో కలసి ఓ సినిమా చేశారు. అదే ‘మాస్ జాతర’. ఈ నెల 31న సాయంత్రం ఆరు గంటలకు ఈ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ రవితేజ – శ్రీలీల కాంబినేషన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే సినిమా గురించి కూడా కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ‘సామజవరగమన’ తర్వాత ఎవరిని కలిసినా ‘మాస్ కథ ఉంటే చెప్పు’ అనేవారట. అందుకే ‘మాస్ జాతర’ కథని రాశారట.
ఇక మాస్ అనగానే గుర్తొచ్చే పేరు రవితేజ అని.. అందుకే ఆయన్ను దృష్టిలో ఉంచుకునే ఈ కథ రాశారట. రవితేజ సినిమాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయట. రవితేజ పోలీసు డ్రెస్ వేసి మరోసారి ప్రేక్షకుల్ని అలరిస్తారట. ఇక తులసి పాత్ర కోసం శ్రీలీల తప్ప మరొకరు గుర్తుకు రాలేదన్నారు భాను. ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో చిరంజీవి – విజయశాంతిని ఇప్పుడు రవితేజ – శ్రీలీల గుర్తు చేస్తారు అన్నారు భాను భోగవరపు. ఇద్దరి మధ్య కామెడీ టచ్‌తో మాస్ సీన్స్ కొన్ని ఉన్నాయట.
అయితే, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విజయశాంతి పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. మోసపోయిన కూతురు, గడుసు ఉండే సింగిల్ అమ్మాయి.. మరిప్పుడు శ్రీలీల పాత్ర ఆ స్థాయిలో మెప్పిస్తుందా అనేది చూడాలి. చిరంజీవి ఎనర్జీని మ్యాచ్ చేయడ రవితేజకు పెద్ద ఇబ్బందేం కాదు.