Anil Ravipudi: అనిల్‌ రావిపూడి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఇదేనట.!

చిరంజీవి చేసిన సినిమాల్లో రామ్‌చరణ్‌ ఏ సినిమా చేస్తే బాగుంటుంది అనే మాట వచ్చినప్పుడు… వినిపించే సినిమా పేర్లలో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ ఒకటి. ఆ సినిమా చిరంజీవి కెరీర్‌లో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందో అందరికీ తెలిసిందే. స్టార్‌ హీరోగా ఉన్న చిరంజీవికి సూపర్ మ్యాన్‌ ఫీల్‌ ఇచ్చిన సినిమా అది. దీంతో ఈ సినిమా మళ్లీ చేస్తే అది రామ్‌చరణ్‌తోనే అని ఫ్యాన్స్‌ అంటూ ఉంటారు. రీమేక్‌ కాకపోతే సీక్వెల్‌ అయినా చేయాలి అని అడుగుతుంటారు.

కానీ సీక్వెల్‌ గురించి అనిల్‌ రావిపూడి మరో మాట చెప్పారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా గురించి అనిల్‌ రావిపూడి చెప్పడమేంటి అనుకుంటున్నారా? దాని వెనుక పెద్ద కారణమే ఉంది. ఆ సినిమా అనిల్‌కి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అంట. ఇంకేముంది రైట్స్‌ తీసుకొని ఆ సినిమా పనేంటో చూసేయొచ్చు కదా అనుకుంటున్నారా? ఆయనకు ఆ సినిమా డ్రీమ్‌ ప్రాజెక్టే.. కానీ హీరోగా చేసేది చరణ్‌ కాదట, చిరంజీవి అట.

అదే ఇక్కడ ట్విస్ట్‌. ‘జగదేకవీరుడిగా చిరంజీవి అయితే బాగుంటారని, సీక్వెల్‌ ఆయనతోనే తీస్తాను అని అంటున్నారు అనిల్‌. నిజానికి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్‌ అంటూ మొదలైతే అది చరణ్‌తోనే అని గతంలో చిరంజీవి కొన్ని సందర్భాల్లో చెప్పారు. నిర్మాత అశ్వనీదత్‌, దర్శకుడు కె.రాఘవేంద్రరావు కూడా ఇదే మాట అంటూ వచ్చారు. అది కూడా అతిలోకసుందరిగా శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ అయితే బాగుంటుంది అనుకున్నారు. ఇప్పుడు అనిల్‌ రావిపూడి వచ్చిన సీక్వెల్‌ కూడా మీరే చేయాలి అంటే చిరంజీవి ఏమంటారో చూడాలి.

అన్నట్లు చిరంజీవి ఇటీవల కుర్ర హీరోలకు వరుస అవకాశాలు ఇస్తున్నారు. బాబీతో ‘వాల్తేరు వీరయ్య’ చేస్తున్న చిరు, వెంకీ కుడుమలకు సినిమా ఛాన్స్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆ సినిమా కథ సిద్ధమవుతోంది. ఇప్పుడు అనిల్‌ ఈ సీక్వెల్‌ ఆలోచనతో వెళ్తే ఓకే చేస్తారా? ఏమో చేసినా చేసేయొచ్చు. చిరు ఆలోచనలు అలా ఉన్నాయి మరి. సరైన కథ రాసుకోవడమే అనిల్‌ తక్షణ కర్తవ్యం.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus