Anil Ravipudi: స్పీడ్ పెంచుతున్న అనిల్ రావిపూడి?

కమర్షియల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం F 3 సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న F2 సినిమాకు ఫ్రాంచైజ్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. వెంకటేష్ వరుణ్ తేజ్ తో పాటు సునీల్ కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా తర్వాత అనిల్ బాలకృష్ణ తో సినిమా చేయాలని అనుకున్నాడు. అందుకోసం చాలా సార్లు బాలయ్య బాబుతో చర్చలు కూడా జరపాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఇతర సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. బాలకృష్ణ, గోపి చంద్ మలినేనితో తన 107వ సినిమాను పూర్తి చేసే వరకు మరో ప్రాజెక్టు మొదలు పెట్టే అవకాశం లేనట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మరో దర్శకుడికి కూడా కమిట్మెంట్ కూడా ఇచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

అయితే అనిల్ రావిపూడి కి మళ్ళీ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ గ్యాప్ లోనే పవర్ఫుల్ కథను వెండి తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. చాలా కాలంగా ఒక లేడీ ఓరియెంటెడ్ కథను తెర పైకి తీసుకు రావాలనే చూస్తున్న ఈ దర్శకుడు ఇటీవల మళ్లీ దాన్ని వెలుగులోకి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. బాలయ్య సినిమా కంటే ముందే ఆ పవర్ఫుల్ కథను ఎలాగైనా జెట్ స్పీడ్ లో ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడట.

సినిమాను మొదలు పెడితే రెండు మూడు నెలల్లోనే ఫినిష్ చేసే విధంగా షెడ్యూల్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి ఆ ప్రాజెక్ట్ కోసం ఒక స్టార్ హీరోయిన్ కోసం వెతికే పనిలో ఉన్నాడట. మరి ఈ దర్శకుడికి ఎలాంటి హీరోయిన్ దొరుకుతుందో చూడాలి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus