Anil Ravipudi: కెలికి మరీ క్లారిటీ ఇచ్చిన అనిల్‌ రావిపూడి.. వాళ్లతో ఇక నాకొద్దు అంటూ…

ఏ విషయంలో అయినా మనోభావాలు దెబ్బతినేవాళ్లు చాలామంది ఉంటారు. సినిమాలు థియేటర్లకు వచ్చి చూడండి.. అక్కడ కూడా మొబైల్‌లో స్కోరు చూసుకోవచ్చు అంటూ ఆ మధ్య ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేకెత్తించాయో మీకు తెలిసే ఉంటుంది. ‘కృష్ణమ్మ’ (Krishnamma) సినిమా ప్రచారంలో భాగంగా అనిల్ రావిపూడి చేసిన ఆ కామెంట్లు కాస్త హార్స్‌గానే ఉన్నా.. ఆయన సినిమా మనిషిగా అలా అన్నారు. అయితే అప్పటికే మొదలైన రచ్చ కారణగా.. ఆయన కవర్‌ చేసుకున్నారు.

మరోసారి ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడారు. ‘‘లైవ్ క్రికెట్ చూడకపోతే కొంపలేం మునిగిపోవు. థియేటర్‌కు వచ్చి సినిమాలు చూడండి’’ అని అనిల్‌ అన్నారనే విషయం మీకు తెలిసే ఉంటుంది. దానికి నెటిజన్లు ‘‘అంత గొప్ప సినిమాలేం తీయడం లేదు. థియేటర్లో చూడకపోతే కొంపలేం మునిగిపోవు. తీరిగ్గా ఓటీటీలో చూసుకుంటాంలే. మాకు క్రికెట్‌ను లైవ్‌గా చూడటమే ఇష్టం’’ అని అన్నారు. దీంతో అలా మాట్లాడటం తప్పేనని అంగీకరించారు అనిల్‌. క్రికెట్ లవర్స్‌కి సారీ చెప్పేశారు కూడా.

తాజాగా మరోసారి ఆ విషయాన్ని హైపర్‌ ఆది వల్ల గుర్తు చేసుకున్నారు అనిల్ రావిపూడి. ‘ఢీ సెలబ్రిటీ’ స్పెషల్‌ అనే డ్యాన్స్‌ షో ఫైనల్‌కి అనిల్‌ రావిపూడి చీఫ్‌ గెస్ట్‌గా వచ్చారు. ఈ క్రమంలో అనిల్ రావిపూడి మీద ఆది (Hyper Aadi) పంచ్‌లు వేశాడు. క్రికెట్, ఐపీఎల్ కాంట్రవర్సీని గుర్తు చేశాడు. ‘‘ఐపీఎల్ చూడకపోతే కొంపలేం మునిగిపోవు’’ అని ఆది అంటే… ఆపు అని అనిల్ ఆపేశాడు. దానికి ఆది ‘మిమ్మల్ని కవర్ చేద్దామని’ అని అంటే..

‘నేను కవర్ చేసుకున్నా.. బ్యాటింగ్ మామూలుగా లేదక్కడ’ అని అనిల్‌ అన్నారు. దీంతో క్రికెటర్‌ లవర్స్ సెగ అనిల్‌కు గట్టిగానే తగిలింది అని మరోసారి జోకులు పేలుతున్నాయి. అందుకే అనిల్‌ కావాలనే సెటైరికల్‌గా అలా ఆదితో అనిపించి.. మరోసారి రెస్పాండ్‌ అయ్యారు అని అంటున్నారు. దీంతో అనిల్‌ని భయపెట్టాం అని గతంలో ట్రోలింగ్‌ చేసినవారు అనుకుంటున్నారట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus