Bimbisara: ‘బింబిసార’ అభిమానులకు షాకింగ్ న్యూస్..!

కళ్యాణ్ రామ్‌ నటించిన ‘బింబిసార’ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ మార్కెట్ ను రెండింతలు పెంచిన సినిమా ఇది. అతనితో కూడా రూ.40 కోట్ల బడ్జెట్ లో సినిమాలు తీయొచ్చు అని ప్రూవ్ చేసిన మూవీ కూడా.అతనిలో మాస్ యాంగిల్ ను కూడా బయటపెట్టింది ఈ చిత్రం. ఇదిలా ఉంటే.. ‘బింబిసార’ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని క్లైమాక్స్ లో హింట్ ఇచ్చారు. ‘బింబిసారుడు’ చనిపోయాడు కాబట్టి..

అతన్ని బ్రతికించే పువ్వుని జుబేదా(శ్రీనివాసరెడ్డి) పాత్ర తీసుకొస్తాడు అన్నట్టు కథని ముగించారు. అంతేకాకుండా ‘బాహుబలి’ (సిరీస్) టైపులో ప్రీక్వెల్ అంశాలు కూడా ఉంటాయని కళ్యాణ్ రామ్ చెప్పాడు. ‘బింబిసారుడు’ అతని తమ్ముడిని ఎందుకు చంపాడు అనే పాయింట్ ను కూడా పార్ట్ 2 లో చూపించనున్నట్టు తెలిపాడు కళ్యాణ్ రామ్. అత్యున్నత గ్రాఫిక్స్‌ హంగులతో పార్ట్ 2 ని భారీ బడ్జెట్ తో రూపొందించనున్నట్టు కళ్యాణ్ రామ్ చెప్పిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. అయితే (Bimbisara) మొదటి పార్ట్ ను మల్లిడి వశిష్ట్ డైరెక్ట్ చేసాడు. పార్ట్ 2 కి మాత్రం అతను డైరెక్ట్ చేసే అవకాశాలు లేవట. మల్లిడి వశిష్ట్ కు పెద్ద హీరోలతో పనిచేసే ఛాన్స్ రావడంతో ‘బింబిసార 2 ‘ పై సరిగ్గా కాన్సెన్ట్రేట్ చేయలేకపోతున్నాడట.

దీంతో మరో దర్శకుడితో ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. కథ, స్క్రీన్ ప్లే మాత్రం వశిష్ఠ్‌ దే. డైరెక్షన్ మాత్రమే వేరే డైరెక్టర్ చేస్తాడన్న మాట. ‘బింబిసార 2 ‘ కి డిస్నీ హాట్ స్టార్ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus