మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు మధ్య వార్ జరుగుతుందా..? అనే విషయంపై సినీ వర్గాల్లో చర్చ నడుస్తూనే ఉంది. టాలీవుడ్ సీనియర్ హీరోలైన వీరిద్దరి మధ్య చాలా కాలంగా మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. గతంలో ‘మా’ ఎలెక్షన్స్ సమయంలో మంచు ఫ్యామిలీ మొత్తం చిరంజీవిని టార్గెట్ చేసింది. మీడియా ముఖంగానే చిరు పేరు బయటకు చెప్పి కామెంట్స్ చేశారు మంచు విష్ణు. రీసెంట్ గా ఏపీ ముఖ్యమంత్రితో చిరు భేటీ విషయంపై కూడా మంచు ఫ్యామిలీ రియాక్ట్ అయింది.
మోహన్ బాబు, చిరంజీవి మధ్య మళ్లీ విభేదాలు తలెత్తినట్లుగా ఇండస్ట్రీలో మాటలు వినిపించాయి. ఈ పరిస్థితుల మధ్య దర్శకుడు డైమండ్ రత్నబాబు ఈ విషయంపై స్పందించారు. చాలా రోజుల తరువాత మోహన్ బాబు లీడ్ రోల్ లో ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమాను రూపొందించారు. ఫిబ్రవరి 18న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకి చిరంజీవి వాయిస్ ఓవర్ అందించారు. సినిమా టీజర్, ట్రైలర్ లలో చిరు వాయిస్ వినిపించింది.
తాజాగా ఈ విషయం గురించి మాట్లాడుతూ.. చిరు, మోహన్ బాబు స్నేహ బంధంపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు రత్నబాబు. ఈ సినిమాలో ఉన్నతభావాలు గల మోహన్ బాబు పాత్రను పరిచయం చేస్తూ.. పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ ఉండాలని ప్లాన్ చేసుకున్నామని రత్నబాబు అన్నారు. చిరంజీవితో వాయిస్ ఓవర్ చెప్పించాలని ఆలోచన తనదేనని.. ఆ విషయం చెప్పగానే మోహన్ బాబు ఒకే అన్నారని.. వెంటనే చిరుకి ఫోన్ చేసి అడిగారని రత్నబాబు చెప్పారు.
ఆ మరుసటి రోజే చిరు వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చారని.. వాళ్లిద్దరి మధ్య అంతటి స్నేహబంధం ఉందని రత్నబాబు అన్నారు. మోహన్ బాబు, చిరంజీవి మధ్య స్నేహ సంబంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుందని చెప్పుకొచ్చారు.
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!